Realme 5 Pro గురించి మీరు తెలుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ గురించి మీరు తెలుసులుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాను ఇక్కడ అందిస్తున్నాను.

Realme 5 Pro గురించి మీరు తెలుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

రియల్మీ సంస్థ,  ఇండియాలో కొత్తగా ఒక 48MP Sony IMX586 సెన్సార్ గల క్వాడ్ రియర్ కెమెరా మరియు మంచి ప్రాసెసర్ తో RealMe 5 Pro  స్మార్ట్ ఫోన్ను ఇండియాలో విడుదల చేసింది. కేవలం ఇది మాత్రమే కానుండా మరెన్నో గొప్ప స్పెక్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ విడుదలయ్యింది. ఈరోజు ఈ ఫోను యొక్క ప్రీ- ఆర్డర్లు మొదలయ్యాయి మరియు సెప్టెంబర్ 4 వ తేదీ నుండి మొదటి సరిగా అమ్మకాలకు రానున్న ఈ స్మార్ట్ ఫోన్ గురించి మీరు తెలుసులుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాను ఇక్కడ అందిస్తున్నాను.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1. ఈ రియల్మీ 5 ప్రో ఒక 6.3 అంగుళాల డ్యూ డ్రాప్ నోచ్ గల FHD + డిస్ప్లేతో అందించబడుతుంది. దీనితో, మీరు 450nits తో అత్యధికమైన బ్రైట్నెస్ తో మంచి పిక్చర్ క్వాలిటీని పొందుతారు.

2. ఈ స్మార్ట్ ఫోన్ అతి సన్నని అంచులు కలిగి ఉంటుంది మరియు 19 :9  ఆస్పెక్ట్ రేషియాతో దాదాపుగా 90.6%  స్క్రీన్-టూ-రేషియో కలిగిన LCD మల్టి టచ్  డిస్ప్లేతో ఉంటుంది.

3. రియల్మీ  ప్రో వెనుక 48MP +8MP+2MP(Macro)+2MP క్వాడ్ రియర్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇందులోని 48MP ప్రధాన Sony IMX 586 సెన్సార్ మరియు f /1.7 అపర్చరుతో వస్తుంది. రెండవ 8MP కెమేరా, 119 డిగ్రిల వైడ్ యాంగిల్ కెమేరా జతగా 2MP మాక్రో కెమేరా మరియు 2MP డెప్త్ కెమేరా పోర్ట్రైట్ లకోసం డెప్త్ సెన్సారుగా ఉపయోగపడుతుంది. అయితే, 2MP మాక్రో కెమేరా 4CM దూరంలోని వాటిని చాలా స్పష్టంగా చిత్రించడానికి ఉపయోగపడుతుంది.     

4. ముందుభాగంలో ఒక గొప్ప 16MP  సెల్ఫీ కెమేరాతో మంచి సెల్ఫీలను తీసుకోవచ్చు.  అంతేకాకుండా, HDR తో వీడియోలను కూడా తీసుకోవచ్చు.   

5.  ఈ ఫోన్ ఒక 4,035 mAh బ్యాటరీతో వస్తుంది మరియు ఇది ఒక VOOC ఫ్లాష్ ఛార్జ్ 3.0 టెక్నలాజితో 20వాట్స్ చార్జరుతో వస్తుంది. అంటే అత్యంత వేగంగా ఈ ఫోన్నుఛార్జ్ చేసుకోవచ్చు.   

6. ఈ రియల్మీ 5 ప్రో ఒక క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 712 AIE ఆక్టా కోర్ ప్రొసెసరుతో వస్తుంది. ఇది స్పీడుగా పనిచేయగల LPDDR4 RAM తో వస్తుంది.అలాగే, ఇది 10nm ప్రాసెస్ టెక్నాలజీతో వస్తుంది మరియు జతగా 4GB/6GB లేదా 8GB ర్యామ్ తో ఎంచుకునేలా వస్తుంది. అంతర్గతంగా, ఈ మూడు వేరియంట్లతో 64GB /128GB స్టోరేజిని అఫర్ చేస్తోంది.

7. ముఖ్యంగా, ఈ ఫోన్ యొక్క స్క్రీన్ ఒక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3+ యొక్క ప్రొటక్షన్ తో వస్తుంది. అంటే స్క్రీన్ త్వరగా పాడవ్వదు మరియు రక్షణ కూడా ఉంటుంది.

8.  ఈ ఫోన్, 8.9MM మందంతో సన్నగా మరియు స్పార్క్లింగ్  బ్లూ మరియు క్రిస్టల్ గ్రీన్ వంటి రెండు అందమైన రంగులలో లభిస్తుంది. ఇది Widevine L1 సర్టిఫికేషన్ తో వస్తుంది. 

9. ఇందులో, సెక్యూరిటీ ఫీచర్లుగా, బ్యాక్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు పేస్ అన్లాక్ ఫీచర్లను అందించారు. అంటే ఇది ప్రస్తుత తరానికి స్టైల్ మరియు సేఫ్టీ పరంగా గొప్పగా ఉంటుంది. 

10. రియల్మీ5 ప్రో యొక్క మూడు  వేరియంట్ ధరలు     

1. రియల్మీ 5 ప్రో  –  4GB RAM + 64 GB స్టోరేజి ధర – 13,999

2. రియల్మీ 5 ప్రో  –  6GB RAM + 64 GB స్టోరేజి ధర – 14,999

3. రియల్మీ 5 ప్రో –  8GB RAM + 128 GB స్టోరేజి ధర – 16,999  

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo