Motorola Edge 70 Pro Sale: ఫస్ట్ సేల్ నుంచి బిగ్ లాంచ్ ఆఫర్స్ అందుకోండి.!
మోటోరోలా లేటెస్ట్ ప్రీమియం ఫోన్ Motorola Edge 70 Pro మొదటిసారిగా రేపు సేల్ కి అందుబాటులోకి వస్తుంది
ఫస్ట్ సేల్ నుంచి అందించిన లాంచ్ ఆఫర్స్ తో మరింత తక్కువ ధరలో కూడా లభిస్తుంది
ఈ స్మార్ట్ ఫోన్ కేవలం మిడ్ రేంజ్ ప్రైస్ సెగ్మెంట్ లో ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది
Motorola Edge 70 Pro Sale: మోటోరోలా ఇండియాలో సరికొత్తగా విడుదల చేసిన లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఎడ్జ్ 70 ప్రో మొదటి సారిగా రేపు సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం మిడ్ రేంజ్ ప్రైస్ సెగ్మెంట్ లో ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది మరియు ఫస్ట్ సేల్ నుంచి అందించిన లాంచ్ ఆఫర్స్ తో మరింత తక్కువ ధరలో కూడా లభిస్తుంది.
SurveyMotorola Edge 70 Pro Sale: ప్రైస్ అండ్ ఆఫర్స్
మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది. ఈ ఎండు వేరియంట్ ప్రైస్ లిస్ట్ ఈ క్రింద చూడవచ్చు.
- మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో (8GB + 256GB) ప్రైస్ : రూ. 38,999
- మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో (12GB + 256GB) ప్రైస్ : రూ. 41,999
ఈ మోటోరోలా లేటెస్ట్ ఫోన్ పాంటోన్ లిల్లీ వైట్, పాంటోన్ టైటాన్ మరియు పాంటోన్ టీ మూడు రంగుల్లో లభిస్తుంది.

ఇక ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై రెండు లాంచ్ ఆఫర్స్ అందించింది. మొదటిది Axis అండ్ HDFC క్రెడిట్ కార్డు ఆప్షన్ పై రూ. 2,000 బ్యాంక్ డిస్కౌంట్. రెండోది రూ. 2,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్. కానీ, ఇక సమయంలో ఈ రెండు ఆఫర్స్ లో ఏదైనా ఒక ఆఫర్ మాత్రమే లభిస్తుంది.
Motorola Edge 70 Pro: ఫీచర్స్
ఈ లేటెస్ట్ మోటరోలా ఫోన్ సరికొత్త 6.99mm స్లీక్ డిజైన్ తో వచ్చింది. ఇందులో 6.8 ఇంచ్ కర్వుడ్ AMOLED స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, HDR10+ సపోర్ట్, 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 5200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 8500 Extreme ప్రోసెసర్ తో లాంచ్ చేసింది. ఇది 2.4Mn+ AnTuTu స్కోర్ అందించే అల్ట్రా ఫాస్ట్ చిప్ సెట్. ఇందులో ఉన్న చిప్ సెట్ కి జతగా 12GB LPDDR5X ర్యామ్ మరియు 256GB భారీ స్టోరేజ్ ను కూడా అందించింది.

ఈ మోటోరోలా ప్రీమియం స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఇందులో 50MP Sony LYT 710 ప్రధాన కెమెరా జతగా 50MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు మరో మూడో కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఇక కెమెరా ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ కెమెరా 60FPS వద్ద 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో వస్తుంది.ఇది కాకుండా నైట్ మోడ్ మరియు లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంది.
Also Read: LG 55 ఇంచ్ AI Smart Tv పై ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది.!
ఇక ఈ ఫోన్ ఇతర ఫీచర్స్ విభాగానికి వస్తే, ఈ ఫోన్ 6500 mAh భారీ బ్యాటరీ మరియు ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 90W టర్బో పవర్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంది. ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉంటాయి మరియు Dolby Atmos తో పాటు Hi Res ఆడియో సపోర్ట్ కూడా ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఇది IP68 మరియు IP69 రేటింగ్ కలిగి మంచి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile