Oppo K14 Plus ఇండియా లాంచ్ అనౌన్స్ చేసిన ఒప్పో .. సన్ అండ్ మూన్ థీమ్ తో టీజింగ్.!

HIGHLIGHTS

Oppo K14 Plus ఇండియా లాంచ్ ను రోజు ఒప్పో రివీల్ చేసింది

ఈ ఫోన్ కోసం అందించిన ప్రత్యేకమైన టీజర్ లో సన్ అండ్ మూన్ థీమ్ తో టీజర్ ఇమేజ్ ను అందించింది

ఈ ఫోన్ కోసం కూడా ఫ్లిప్ కార్ట్ సేల్ పార్టనర్ గా ఉంటుంది

Oppo K14 Plus ఇండియా లాంచ్ అనౌన్స్ చేసిన ఒప్పో .. సన్ అండ్ మూన్ థీమ్ తో టీజింగ్.!

Oppo K14 Plus ఇండియా లాంచ్ ను రోజు ఒప్పో రివీల్ చేసింది. రీసెంట్ గా ఒప్పో కె సిరీస్ నుంచి ఒప్పో కె లైట్ 4జి ఫోన్ విడుదల చేసిన ఒప్పో, ఈరోజు ఈ అప్ కమింగ్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం అందించిన ప్రత్యేకమైన టీజర్ లో సన్ అండ్ మూన్ థీమ్ తో టీజర్ ఇమేజ్ ను అందించింది. ఈ అప్ కమింగ్ ఒప్పో స్మార్ట్ ఫోన్ లాంచ్ వివరాలపై ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Oppo K14 Plus లాంచ్ డేట్

ఒప్పో కె 14 ప్లస్ స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ అండ్ టైం ఇంకా రివిల్ చేయలేదు. ఈ అప్ కమింగ్ K సిరీస్ ఫోన్ కోసం కేవలం టీజింగ్ మాత్రమే మొదలుపెట్టింది. ఈ ఫోన్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా ప్రత్యేకమైన మైక్రో సైట్ బ్యానర్ మరియు టీజర్ పేజి అందించింది. అంటే, ఈ ఫోన్ కోసం కూడా ఫ్లిప్ కార్ట్ సేల్ పార్ట్నర్ గా ఉంటుంది.

Oppo K14 Plus : ఫీచర్స్

ఈ అప్ కమింగ్ ఫోన్ ఫ్లాట్ స్క్రీన్ తో మరియు స్లీక్ డిజైన్ తో ఉన్నట్లు ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ చెబుతోంది. ఈ టీజర్ ఇమేజ్ లో రెండు కలర్స్ లో ఫోన్ ను చూపించింది. ఇందులో ఒకటి ఫ్లేమ్ ఆరెంజ్ మరియు రెండవది కూల్ సిల్వర్ కలర్ లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అయితే, ఈ ఫోన్ కలర్స్ లేదా ఇతర వివరాలు ఇంకా కంపెనీ అనౌన్స్ చేయలేదు. ఇది మనం అంచనా వేసి చెబుతున్న కలర్స్ మాత్రమే అని గమనించాలి.

Oppo K14 Plus

ఇక టీజర్ ఇమేజ్ లో ఈ ఫోన్ వెనుక బిగ్ కెమెరా మరియు రౌండ్ కార్నర్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది కాకుండా ఈ ఫోన్ లో మెటల్ ఫ్రేమ్ ఉన్నట్లు కూడా ఈ ఫోన్ డిజైన్ ను డీప్ గా చూస్తే అనిపిస్తుంది. అయితే, అఫీషియల్ ఫీచర్స్ అనౌన్స్ చేసే వరకు ఇవన్నీ కేవలం అంచనా మరియు లీక్డ్ ఫీచర్ గా మాత్రమే చూడాలి.

Also Read: Lava Bold N4 Pro 5G ఫోన్ ను బడ్జెట్ ధరలో బిగ్ 6000 mAh బ్యాటరీతో లాంచ్ చేసిన లావా.!

అంచనా ఫీచర్స్

ఈ ఫోన్ ను ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేసే అవకాశం ఉండొచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫోన్ లో బిగ్ AMOLED స్క్రీన్ ను అధిక బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో లాంచ్ చేసే అవకాశం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే, ఈ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ 5G చిప్ సెట్, 6000 నుంచి 7000 mAh బ్యాటరీ వంటి ఫీచర్స్ కూడా కలిగి ఉండే అవకాశం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

అయితే, ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ కీలక ఫీచర్లు కూడా కంపెనీ త్వరలో వెల్లడిస్తుంది కాబట్టి, ఈ ఫోన్ ఎటువంటి ఫీచర్స్ తో లాంచ్ అవుతుంది, అని మనకు త్వరగా తెలిసే అవకాశం ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile