Digit.in

కేవలం 30 వేలకే 55 ఇంచ్ Mini LED స్మార్ట్ టీవీ లభిస్తోంది .. ఈ ప్రైస్ లో బెస్ట్ డీల్ ఇదే.!

Highlights

పెద్ద స్క్రీన్‌ పై సినిమాలు మరియు వెబ్ సిరీస్‌ చూస్తే చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది

అది కూడా Mini LED స్మార్ట్ టీవీ Google TV డీల్ అందుబాటులో ఉంది

ఈ టీవీ 4K రిజల్యూషన్, Dolby Vision మరియు Dolby Atmos వంటి ప్రీమియం ఫీచర్లతో వస్తుంది

కేవలం 30 వేలకే 55 ఇంచ్ Mini LED స్మార్ట్ టీవీ లభిస్తోంది .. ఈ ప్రైస్ లో బెస్ట్ డీల్ ఇదే.!

పెద్ద స్క్రీన్‌ పై సినిమాలు మరియు వెబ్ సిరీస్‌ చూస్తే చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది. అయితే, పెద్ద టీవీల ధర కారణంగా చాలా మంది కొనుగోలు ధరలు 43 ఇంచ్ లేదా 50 ఇంచ్ టీవీల వరకు మాత్రమే ఎంచుకుంటారు. మీరు కూడా అలాగే ఆలోచిస్తుంటే, మీకోసం ఈరోజు మంచి 55 ఇంచ్ స్మార్ట్ టీవీ, అది కూడా Mini LED స్మార్ట్ టీవీ Google TV డీల్ అందుబాటులో ఉంది. ఈ టీవీ 4K రిజల్యూషన్, Dolby Vision మరియు Dolby Atmos వంటి ప్రీమియం ఫీచర్లతో వస్తుంది.

55 ఇంచ్ Mini LED స్మార్ట్ టీవీ : డీల్

2024 మధ్య సంవత్సరంలో MOTOROLA ఇండియాలో విడుదల చేసిన ప్రీమియం 55 ఇంచ్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ ఈరోజు ఈ ప్రైస్ లో అందుబాటులో ఉంది. ఈ టీవీ యోగా ఈరోజు ఫ్లిప్ కార్ట్ 50 శాతం భారీ డిస్కౌంట్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ టీవీ కేవలం రూ. 32,499 రూపాయల ఆఫర్ ధరలో లిస్ట్ అయ్యింది.

55 inch Mini LED smart tv

కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ స్మార్ట్ టీవీ పైన భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. అదేమిటంటే, ఈ స్మార్ట్ టీవీని పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో తీసుకునే వారికి రూ. 2,350 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ మీకు కేవలం రూ. 30,149 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది.

మోటోరోలా 55 ఇంచ్ Mini LED స్మార్ట్ టీవీ : ఫీచర్స్

మోటోరోలా యొక్క ఈ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ QD మినీ ఎల్ఈడి స్క్రీన్ ని కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 4K UHD రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 500 నిట్స్ మంచి బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ టీవీ డాల్బీ విజన్, HDR 10 మరియు 160 జోన్స్ లోకల్ డిమ్మింగ్ వంటి ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ గూగుల్ టీవీ 5.0 ఆపరేటింగ్ సిస్టమ్‌ తో నడుస్తుంది మరియు 2GB RAM అండ్ 16GB స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఇది మంచి స్లీక్ డిజైన్ మరియు బెజెల్ లెస్ స్క్రీన్ తో కూడా వస్తుంది. ఈ టీవీ రెండు ఫుల్ రేంజ్ స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు టోటల్ 20W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్ కలిగి ఉంటుంది కాబట్టి ఈ టీవీ మంచి సౌండ్ కూడా ఆఫర్ చేస్తుంది. ఈ టీవీలో కనెక్టివిటీ కోసం మూడు HDMI పోర్టులు, రెండు USB పోర్టులు, Wi-Fi సపోర్ట్ ఉన్నాయి. అంతేకాదు, ఇందులో MEMC మరియు ALLM ఫీచర్లు కూడా ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile