EPFO New Update: ఇకపై UAN జనరేషన్‌కు ఫేస్ అథెంటికేషన్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం.!
EPFO New Update రిలీజ్ చేసింది
యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (UAN) పై ఈ కొత్త అప్డేట్ అందించింది
ఫేస్ అథెంటికేషన్ లేకుండా ఇక నుంచి UAN ను జనరేట్ చేయడం కుదరదు
EPFO New Update: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్) ఎంప్లాయిస్ కోసం కొత్త అప్డేట్ రిలీజ్ చేసింది. పెరుగుతున్న మోసాలు మరియు ఇతర స్కామ్ లతో ఎంప్లాయిస్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలా ఈ కొత్త అప్డేట్ తీసుకొచ్చినట్లు చెబుతోంది. అదే ఈపీఎఫ్ కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఫేస్ అథెంటికేషన్’ అప్డేట్. ఇప్పటి వరకు UAN పై జనరల్ అప్డేట్ మాత్రమే అందించిన ఈపీఎఫ్, ఇప్పుడు ఈ మేజర్ అప్డేట్ ను ప్రవేశపెట్టింది.
Surveyఏమిటి ఈ EPFO New Update ?
ఈపీఎఫ్ ఖాతాలకు అత్యంత ప్రధానమైన మరియు అవసరమైన యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (UAN) పై ఈ కొత్త అప్డేట్ అందించింది. ఇప్పటి వరకు UAN జనరేట్ చేయడానికి ఈపీఎఫ్ అకౌంట్ నెంబర్ ఉంటే సరిపోయేది. కానీ, ఇప్పుడు UAN నెంబర్ జనరేట్ చేయడానికి ఫేస్ అథెంటికేషన్ తప్పనిసరి చేసింది ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్). అంటే, ఫేస్ అథెంటికేషన్ లేకుండా ఇక నుంచి UAN ను జనరేట్ చేయడం కుదరదు, అని తేల్చి చెప్పింది.
EPFO New Update ఎందుకు తెచ్చింది?
ఈపీఎఫ్ ఈ కొత్త అప్డేట్ ను ముఖ్యంగా ఫేక్ లేదా బోగస్ అకౌంట్ లను అరికట్టడానికి తీసుకువచ్చింది. ఫేస్ అథెంటికేషన్ ఆధారితంగా నిజమైన ఎంప్లాయిస్ కి మాత్రమే ప్రయోజనాలు అందేలా ఈ కొత్త విధానం ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఈ కొత్త అప్డేట్ మరియు చర్య ద్వారా డిజిటల్ సురక్షితను మరింత మెరుగుపరిచే అవకాశం ఉంటుంది.

ఇది ఎవరికి అవసరం?
కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు, కొత్త UAN నెంబర్ తీసుకోవాలని చూస్తున్న వారు, ఇప్పటి వరకు KYC అప్డేట్ చేయని వారు ఈ కొత్త రూల్ పరిధిలోకి వస్తారు. అంటే, వీరందరూ కూడా ఇప్పుడు వారి ఫేస్ అథెంటికేషన్ తో UAN జనరేట్ లేదా అప్డేట్ చేసుకోవాలి.
Also Read: నెవర్ బిఫోర్ ఆఫర్: కేవలం రూ. 16,999 ధరకే 43 ఇంచ్ 4K QLED Smart Tv అందుకోండి.!
ఫేస్ అథెంటికేషన్ ఎలా చేయాలి?
EPFO అధికారిక వెబ్సైట్ లేదా UMANG యాప్ ద్వారా మీరు ఫేస్ అథెంటికేషన్ నిర్వహించవచ్చు. దీనికోసం మీ మొబైల్ కెమెరా తో ఫేస్ అథెంటికేషన్ చేసి దాన్ని ఆధార్ తో అనుసంధానం చేయాలి. ఈ వివరాలు చెక్ చేసిన తర్వాత ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్) అప్రూవ్ చేస్తుంది. ఈ ధ్రువీకరణ తరువాతే మీకు UAN నంబర్ లభిస్తుంది.