vivo X200T ఇండియా లాంచ్ కంటే ముందే ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!
vivo X200T రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో విడుదల చేయబడుతుంది
ఈ స్మార్ట్ ఫోన్ యొక్క అంచనా ప్రైస్ అండ్ ఫీచర్స్ నెట్టింట్లో దర్శనమిచ్చాయి
ఈ స్మార్ట్ ఫోన్ అంచనా ధర మరియు ఫీచర్లు ఏమిటో ఒక లుక్కేద్దామా
vivo X200T స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో విడుదల చేయబడుతుంది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కావడానికి ముందే ఈ స్మార్ట్ ఫోన్ యొక్క అంచనా ప్రైస్ అండ్ ఫీచర్స్ నెట్టింట్లో దర్శనమిచ్చాయి. మరి రేపు ఇండియాలో లాంచ్ కాబోతున్న ఈ స్మార్ట్ ఫోన్ అంచనా ధర మరియు ఫీచర్లు ఏమిటో ఒక లుక్కేద్దామా.
Surveyvivo X200T : అంచనా ప్రైస్
వివో ఈ స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో 50 వేల నుంచి 55 వేల రూపాయల ధరలో లాంచ్ చేసే అవకాశం ఉందని ముందుగా అంచనా వేశారు. అయితే, ఈ ఫోన్ ను 25 వేల రూపాయల ధరలో వివో లాంచ్ చేసే అవకాశం ఉందని కొత్త లీక్స్ చెబుతున్నాయి. అయితే, ఈ ఫోన్ ను రేపు కంపెనీ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన తర్వాత ఈ మాటల్లో నిజం ఎంతో తెలుస్తుంది.
vivo X200T : ఫీచర్స్
ఈ వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ను కంపెనీ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ కూడా ఆన్లైన్ లో దర్శనం ఇచ్చాయి. ఆన్లైన్ వచ్చిన లీక్స్ మరియు అంచనా స్పెక్స్ ఆదారంగా ఈ ఫోన్ వివరాలు అందిస్తున్నాము. లీక్స్ ప్రకారం, ఈ ఫోన్ లో 1.5K రిజల్యూషన్ కలిగిన పెద్ద 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ మరియు 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ 3nm ప్రాసెసర్ Dimensity 9400+ తో లాంచ్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే కాదు ఇందులో పెద్ద LPDDR5X ర్యామ్ మరియు 512GB వరకు స్టోరేజ్ ఆప్షన్ ఉండవచ్చని కూడా చెబుతున్నారు.

కెమెరా పరంగా, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో ZEISS T లెన్స్ కోటింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. ఇది 50MP Sony IMX 921 ప్రధాన కెమెరా, 50MP అల్ట్రా వైడ్ మరియు 50MP పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ ఉంటాయి. ఈ ఫోన్ సూపర్ స్టేబుల్ 4K వీడియో రికార్డింగ్ మరియు Ai కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో ముందు 32MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది.
Also Read: Klipsch Dolby Atmos సౌండ్ బార్ పై జబర్దస్త్ ఆఫర్లు ప్రకటించిన అమెజాన్.!
ఇక ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ లో కూడా భారీ 6200 mAh బ్యాటరీ కలిగి ఉంటుందని లీక్స్ చెబుతున్నాయి. అలాగే, ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 40W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండవచ్చని అంచానా వేస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ లో రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ కూడా IP68 అండ్ IP69 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.
ఈ ఫోన్ రేపు లాంచ్ అవుతుంది కాబట్టి ఇన్ని రోజులు కొనసాగిన సస్పెన్స్ ముగుస్తుంది.