BSNL Republic Day offer: ప్రభుత్వ టెలికాం కంపెనీ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) 77వ భారత రిపబ్లిక్ డే ని పురస్కరించుకుని తన వినియోగదారులకు అత్యంత ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త ఆఫర్ ప్రీపెయిడ్ ప్లాన్ అధిక డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ వంటి అనేక లాభాలు అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందుకుంటారు.
Survey
✅ Thank you for completing the survey!
BSNL Republic Day offer: ఏమిటా ఆఫర్?
77వ గణతంత్ర దినోత్సవాన్ని (26 జనవరి 2026) పురస్కరించుకునేందుకు ఈ కొత్త ఆఫర్ రూపొందించబడింది. అంటే, 2026 జనవరి 26 ను కుదించి రాస్తే 2626 వస్తుంది, ఈ ప్లాన్ ను కూడా ఇదే ప్రైస్ తో బిఎస్ఎన్ఎల్ అందించింది. ఇది మాత్రమే కాదు దీంతోపాటు వచ్చే డేటా కూడా 2.6 జీబీ గా నిర్ణయించబడింది. సింపుల్ గా చెప్పాలంటే ఈ ప్లాన్ రిపబ్లిక్ డే మరియు 2026 సంవత్సరం ఓవరాల్ థీమ్ గా ఉంటుంది.
ఈ కొత్త ఆఫర్ ప్రీపెయిడ్ ప్లాన్ ను రూ. 2626 రూపాయల ధరలో అందించింది. ఈ ఇది వన్ ఇయర్ వ్యాలిడిటీ తో వచ్చే లాంగ్ ప్రీపెయిడ్ ప్లాన్ మరియు సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఇక ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే లాభాల విషయానికి వస్తే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 365 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందుకుంటారు. సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2.6 జీబీ హై స్పీడ్ డేటా మరియు ఈ డేటా ముగిసిన తర్వాత 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా కూడా అందిస్తుంది. ఇదే కాదు, ఈ ప్లాన్ తో 365 రోజులు రోజుకు 100 SMS వినియోగ ప్రయోజనం కూడా అందుకుంటారు.
ఇది రెగ్యులర్ ప్రీపెయిడ్ కాదని మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే, కేవలం లిమిటెడ్ పీరియడ్ టైం కోసం మాత్రమే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ ను బిఎస్ఎన్ఎల్ అందించింది. ఈ ప్లాన్ 2026 జనవరి 24 నుంచి బిఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తీసుకొచ్చింది మరియు 2026 ఫిబ్రవరి 24 వ తేదీతో ఈ ప్లాన్ ముగుస్తుంది. అంటే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కేవలం నెల రోజులు మాత్రమే అందుబాటులో ఉండే లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ అన్నమాట.
బిఎస్ఎన్ఎల్ అందించిన ఈ ప్రత్యేకమైన ఆఫర్ ను బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.