Digit.in

Apple సర్వీసుల్లో భారీ అంతరాయం.. iCloud నుంచి Apple Pay వరకు అనేక సేవలు డౌన్.!

Highlights

అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆపిల్ సేవల్లో నవంబర్ 17న సాంకేతిక అంతరాయం ఏర్పడింది

Apple Store వంటి పలు సేవలు సరిగ్గా పనిచేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు

ఆపిల్ సర్వీస్ అంతరాయం టెక్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది

Apple సర్వీసుల్లో భారీ అంతరాయం.. iCloud నుంచి Apple Pay వరకు అనేక సేవలు డౌన్.!

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే మరియు అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆపిల్ సేవల్లో నవంబర్ 17న సాంకేతిక అంతరాయం ఏర్పడింది. Apple Pay, iCloud, App Store, Apple Music, Apple Support మరియు Apple Store వంటి పలు సేవలు కొంత సమయం పాటు సరిగ్గా పనిచేయకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా అమెరికాలోని పలువురు యూజర్లు తమకు ఎదురైన సమస్యల గురించి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో ఆపిల్ సర్వీస్ అంతరాయం టెక్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.

ఏయే సేవలు ప్రభావితమయ్యాయి?

ఈ అంతరాయం కారణంగా కొంతమంది వినియోగదారులు iCloud లోకి లాగిన్ కావడంలో సమస్యలు చూసినట్లు తెలిపారు. అలాగే, App Store నుంచి యాప్‌ లను డౌన్‌ లోడ్ చేసుకోవడంలో సమస్యలు ఎదుర్కొన్నట్లు కూడా వెల్లడించారు. యాపిల్ మ్యూజిక్ వినియోగంలోనూ కనెక్టివిటీ ఇబ్బందులు వచ్చినట్లు నివేదికలు వెల్లడించాయి. అలాగే, యాపిల్ ప్లే ద్వారా చెల్లింపులు చేయడం, యాపిల్ సపోర్ట్ సేవలను ఉపయోగించడంలో కూడా కొందరికి సమస్యలు ఎదురయ్యాయి. అయితే అన్ని ప్రాంతాల్లో, వినియోగదారులందరికీ ఒకే విధమైన సమస్యలు ఎదురుకాలేదని తెలుస్తోంది.

అంతరాయం ఎంత సమయం కొనసాగింది

ఆపిల్ అధికారిక సిస్టమ్ స్టేటస్ సమాచారం ప్రకారం, Subscription Purchase సేవలో ఏర్పడిన అంతరాయం నవంబర్ 17న ఉదయం 8:47 UTC గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:02 UTC గంటలకు పరిష్కారమైంది. అంటే, సుమారు 3 గంటల 15 నిమిషాల పాటు ఈ సమస్య కొనసాగింది. అయితే, ఇతర సేవలకు సంబంధించిన అన్ని సమస్యలకు ఒకే ఔటేజ్ గా ఆపిల్ అధికారికంగా ధ్రువీకరించలేదు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile