Digit.in

Google Pixel 11 స్మార్ట్ ఫోన్ రూ. 12,000 భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది .. ఎక్కడంటే.!

Highlights

Google Pixel 11 ను చవక ధరలో కొనాలని చూసే వారికి గుడ్ న్యూస్

గూగుల్ పిక్సెల్ 11 స్మార్ట్ ఫోన్ రూ. 12,000 భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది

ఈ ఫోన్ Google Tensor G6 ప్రాసెసర్ జతగా Titan M3 సెక్యూరిటీ చిప్ తో పని చేస్తుంది

Google Pixel 11 స్మార్ట్ ఫోన్ రూ. 12,000 భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది .. ఎక్కడంటే.!

Google Pixel 11 స్మార్ట్ ఫోన్ తన డిజైన్ మరియు కెమెరా ఫీచర్స్ తో భారత మార్కెట్ లో తనదైన గొప్ప స్థానాన్ని సంపాదించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను చవక ధరలో కొనాలని డీల్స్ మరొఇయి డిస్కౌంట్ ఆఫర్స్ కోసం చూసే వారు అనేక మంది ఉంటారు. అలా ఎదురు చూసే వారిలో మీరు కూడా ఉంటే, మీ కోసమే ఈ గుడ్ న్యూస్. గూగుల్ పిక్సెల్ 11 స్మార్ట్ ఫోన్ రూ. 12,000 భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. ఈ ఫోన్ ఈ ప్రైస్ లో ఎక్కడ లభిస్తుంది మరియు ఈ ఫోన్ ఫీచర్స్ ఏమిటీ అని కంప్లీట్ గా తెలుసుకోండి.

Google Pixel 11 ఆఫర్ ఎక్కడ లభిస్తుంది?

గూగుల్ పిక్సెల్ 11 స్మార్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి చాలా చవక ధరలో లభిస్తుంది. ఈ ఫోన్ ఇండియాలో రూ. 89,999 రూపాయల ప్రైస్ తో లాంచ్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ ఈరోజు అమెజాన్ నుంచి రూ. 12,300 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 77,699 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.

Google Pixel 11

కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ ఫోన్ ను అమెజాన్ నుంచి Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 1,942 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ మీకు కేవలం రూ. 75,757 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ ఉంచి ఈ ఆఫర్ ధరలో కొనడానికి Buy From Here పైన క్లిక్ చేయండి.

Google Pixel 11 : ఫీచర్స్

గూగుల్ ఈ కొత్త స్మార్ట్‌ ఫోన్ ను భారత మార్కెట్లో రీసెంట్ గా విడుదల చేసింది. ఈ ఫోన్‌ 6.3 అంగుళాల Actua OLED స్క్రీన్ ని 120Hz రిఫ్రెష్ రేట్ మరియు హై బ్రైట్నెస్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Google Tensor G6 ప్రాసెసర్ జతగా Titan M3 సెక్యూరిటీ చిప్ తో పని చేస్తుంది. 12GB RAM మరియు 256GB స్టోరేజ్ తో ఈ ఫోన్ వస్తుంది.

ఇక ఈ ఫోన్ కెమెరాల విషయానికి వస్తే, ఇందులో 48MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రా వైడ్ కెమెరా, 10.8MP టెలిఫోటో కెమెరాలతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్ లో 5x ఆప్టికల్ జూమ్ మరియు 30x సూపర్ జూమ్ సపోర్ట్ ఉన్నాయి. అలాగే, సెల్ఫీల కోసం 10.5MP ఫ్రంట్ కెమెరాని కూడా గూగుల్ అందించింది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్, నైట్ సైట్ మరియు మ్యాజిక్ ఎరేజర్ వంటి ఫీచర్లు కలిగి ఉంటుంది .

ఈ ఫోన్‌ లో 4,985mAh బ్యాటరీని 30W వైర్డ్ ఛార్జింగ్ మరియు 25W వైర్‌ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ లో Android 17 ఆధారిత సాఫ్ట్‌ వేర్‌ తో పాటు Gemini AI ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile