Digit.in

సేల్ తర్వాత కూడా లేటెస్ట్ TCL Mini LED స్మార్ట్ టీవీ పైన జబర్దస్త్ ఆఫర్స్ అందించిన ఫ్లిప్ కార్ట్.!

Highlights

దీపావళి సందర్భంగా ఫ్లిప్ కార్డ్ తీసుకొచ్చిన బిగ్ బ్యాంక్ దివాళి సేల్ నిన్నటి తో ముగిసింది

సేల్ ముగిసిన తర్వాత కూడా లేటెస్ట్ TCL Mini LED స్మార్ట్ టీవీ పైన ఫ్లిప్ కార్ట్ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది

ఈ స్మార్ట్ టీవీని ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన బిగ్ డీల్స్ తో మంచి రీజనబుల్ ప్రెస్ లో అందుకోవచ్చు

సేల్ తర్వాత కూడా లేటెస్ట్ TCL Mini LED స్మార్ట్ టీవీ పైన జబర్దస్త్ ఆఫర్స్ అందించిన ఫ్లిప్ కార్ట్.!

దీపావళి సందర్భంగా ఫ్లిప్ కార్డ్ తీసుకొచ్చిన బిగ్ బ్యాంక్ దివాళి సేల్ నిన్నటి తో ముగిసింది. అయితే, సేల్ ముగిసిన తర్వాత కూడా లేటెస్ట్ TCL Mini LED స్మార్ట్ టీవీ పైన ఫ్లిప్ కార్ట్ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ 2026 లేటెస్ట్ ఎడిషన్ టీవీ మరియు చాలా గొప్ప బ్రైట్నెస్ తో స్టన్నింగ్ విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీని ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన బిగ్ డీల్స్ తో మంచి రీజనబుల్ ప్రెస్ లో అందుకోవచ్చు.

TCL Mini LED స్మార్ట్ టీవీ : డీల్

టిసిఎల్ 2026 లో సరికొత్తగా విడుదల చేసిన 55 ఇంచ్ QD-Mini ఎల్ఈడి స్మార్ట్ టీవీ పైన ఫ్లిప్ కార్ట్ ఈరోజు జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ లను అందించింది. టిసిఎల్ ఈ స్మార్ట్ టీవీని రూ. 55,990 ప్రైస్ తో అందించింది. అయితే, ఫ్లిప్ కార్ట్ ఈ స్మార్ట్ టీవీని తక్కువ ధరలో అందుకోవడానికి వీలుగా బిగ్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ చాలా తక్కువ ధరలో లభిస్తుంది.

TCL Mini LED smart tv deal

ఇక ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీపై ఫ్లిప్ కార్ట్ ఈరోజు రూ. 5,650 రూపాయల భారీ ఫ్లిప్ కార్ట్ SBI మరియు ఫ్లిప్ కార్ట్ Axis బ్యాంక్ క్రెడిట్ కార్డు డిస్కౌంట్ ఆఫర్స్ ని అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 50,340 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.

TCL Mini LED స్మార్ట్ టీవీ : ఫీచర్స్

టిసిఎల్ ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీని మినీ ప్లస్ క్యూలెడ్ ఎల్ఈడి స్క్రీన్ తో అందించింది. ఈ స్క్రీన్ 4K UHD రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ (DLG 120Hz) వంటి సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ 450 నిట్స్ HDR బ్రైట్నెస్, డాల్బీ విజన్, HDR 10+ మరియు బెజెల్ లెస్ డిజైన్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ AiPQ Pro క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో నడుస్తుంది మరియు లేటెస్ట్ టిసిఎల్ Ai సపోర్ట్ కూడా కలిగి ఉంది.

ఇక ఈ టీవీ కలిగిన సౌండ్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ టీవీ రెండు స్పీకర్లు కలిగి మొత్తంగా 30W సౌండ్ అందిస్తుంది. ఈ టీవీలో Dolby Atmos మరియు DTS Virtual X సౌండ్ టెక్ సపోర్ట్ కూడా ఉండటంతో ఈ టీవీ గొప్ప సౌండ్ అందిస్తుంది. ఇందులో డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, HDMI, ఆప్టికల్ అవుట్, ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ గొప్ప విజువల్స్ మరియు సౌండ్ ని అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile