Airtel vs Jio: కొత్తగా ప్రకటించిన Buy 1 Get 1 Free రీఛార్జ్ ఆఫర్లలో ఏ ప్లాన్ ఎక్కువ లాభం.!
టెలికాం యూజర్లకు ఎయిర్‌టెల్ మరియు జియో అదిరిపోయే రీఛార్జ్ ఆఫర్లు
Buy 1 Get 1 Free ఆఫర్ తో ఒకసారి రీఛార్జ్ చేస్తే మరోసారి ఉచితంగా రీఛార్జ్ ప్రయోజనం పొందే అవకాశం
ఈ ఆఫర్లు అందరికీ అందుబాటులో ఉన్నాయా లేదా ఎవరికి లభిస్తుందనేది సర్ప్రైజ్

టెలికాం యూజర్లకు ఎయిర్‌టెల్ మరియు జియో అదిరిపోయే రీఛార్జ్ ఆఫర్లను అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. Buy 1 Get 1 Free పేరుతో ప్రచారంలో ఉన్న ఈ ఆఫర్లలో ఒకసారి రీఛార్జ్ చేస్తే మరోసారి ఉచితంగా రీఛార్జ్ ప్రయోజనం పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఈ ఆఫర్లు అందరికీ అందుబాటులో ఉన్నాయా లేదా ఎవరికి లభిస్తుంది అనేది సర్ప్రైజ్. అంతేకాదు, ఈ రీఛార్జ్ ఆఫర్లలో ఏ ప్లాన్ ఎక్కువ లాభం అందిస్తోందో కూడా ఈ రోజు చూద్దాం.
Airtel vs Jio: ఏమిటి ఈ ఆఫర్
ఎంపిక చేసిన కొంతమంది ప్రీపెయిడ్ కస్టమర్ లకు ఉచిత లాభాలు అందించే కొత్త బై 1 గెట్ 1 ఫ్రీ రీఛార్జ్ ఆఫర్ ని ఎయిర్టెల్ మరియు జియో టెలికాం కంపెనీలు అందిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
Airtel రూ.349, రూ.399 ప్లాన్లపై ఆఫర్?
ఎయిర్టెల్ అందిస్తున్నట్లు ప్రచారంలో ఉన్న బై 1 గెట్ 1 ఫ్రీ ఆఫర్ లో రూ.349, రూ.399 రీఛార్జ్ ప్లాన్లు ఉన్నాయి. సాధారణంగా 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ లపై అదనంగా మరో 28 రోజుల ప్రయోజనం లభించే అవకాశం ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో అర్హత కలిగిన వినియోగదారులు మొత్తం 56 రోజుల వరకు వ్యాలిడిటీ ప్రయోజనం అందుకునే అవకాశం ఉంటుంది. రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్ మరియు రోజుకు 100 SMS వంటి ప్రయోజనాలు ఆయా రీఛార్జ్ ప్లాన్ నిబంధనల ప్రకారం ఉంటాయి.
Jio రూ.299, రూ.349 రీఛార్జ్ ప్లాన్ లపై బెనిఫిట్స్
రిలయన్స్ జియో కూడా రూ.299, రూ.349 ప్లాన్లపై బై 1 గెట్ 1 ఫ్రీ ఆఫర్ అందిస్తున్నట్లు వార్తలు ఉన్నాయి. రూ.299 ప్లాన్ లో రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMS వంటి ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, రూ.349 ప్లాన్ లో రోజుకు 2GB డేటాతో పాటు అర్హత కలిగిన యూజర్లకు అన్‌లిమిటెడ్ 5G డేటా కూడా ప్రయోజనం లభిస్తుంది. ఈ ఆఫర్ ద్వారా అదనంగా మరో 28 రోజుల వ్యాలిడిటీ పొందే అవకాశం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఏ కంపెనీ ఆఫర్ ఎక్కువ ప్రయోజనకరం?
తక్కువ ధరలో రీఛార్జ్ చేసుకోవాలనుకునే వారికి జియో రూ.299 ప్లాన్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అయితే, రోజువారీ ఎక్కువ డేటా కావాలి అనుకునే వారు జియో రూ.349 లేదా ఎయిర్టెల్ రూ.399 ప్లాన్లను పరిశీలించవచ్చు. యూజర్లు కేవలం ధర ఆధారంగా నిర్ణయం తీసుకోకుండా డేటా అవసరం, నెట్ వర్క్ కవరేజ్ వంటి అదనపు ప్రయోజనాలను కూడా పోల్చుకోవాలి.
అందరికీ ఈ ఆఫర్లు వస్తాయా?
ఈ ఆఫర్ విషయంలో వినియోగదారులు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, ఇవి సాధారణ రీఛార్జ్ ప్లాన్ లకు వర్తించే సాధారణ ప్రయోజనం కాదు. ఈ ఆఫర్ కేవలం ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే కనిపించే పరిమితకాల ప్రమోషనల్ ఆఫర్ మాత్రమే అని నివేదికలు పేర్కొంటున్నాయి.
ఈ ఆఫర్ కోసం ఎయిర్టెల్ యూజర్లు Airtel Thanks యాప్ లో మరియు జియో కస్టమర్లు MyJio యాప్ లో తమ నంబర్ తో లాగిన్ చేసి ఈ ఆఫర్ అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. రీఛార్జ్ చేసే ముందు ఉచిత వ్యాలిడిటీ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది, దానికి సంబంధించిన నిబంధనలు ఏమిటి అని కూడా తప్పనిసరిగా పరిశీలించాలి.
గమనిక: ఈ ఆఫర్ లకు సంబంధించిన పూర్తి నిబంధనలు మరియు అర్హతలు సంబంధిత టెలికాం సంస్థల అధికారిక యాప్ లలో ధృవీకరించుకున్న తర్వాతే ఈ రీఛార్జ్ చేయడం మంచిది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.
View full profile
