Digit.in

Vivo X500 Series ఇండియా లాంచ్ కంటే ముందే లీకైన ప్రైస్ .. ఎంతంటే.!

Highlights

Vivo X500 Series ధరలు లాంచ్‌ కు ముందే ఆన్‌ లైన్‌ లో లీక్ కావడం చర్చకు దారితీసింది

వివో X500, వివో X500 ప్రో, వివో X500 ప్రో మాక్స్ వంటి మోడళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం

ఈ సిరీస్‌ లోని ప్రత్యేక మాస్టర్ సెట్ ధర ఏకంగా రూ.2,29,999 రూపాయలుగా ఉండొచ్చని లీకులు చెబుతున్నాయి

Vivo X500 Series ఇండియా లాంచ్ కంటే ముందే లీకైన ప్రైస్ .. ఎంతంటే.!

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ తయారీ సంస్థ వివో నుంచి మరో కొత్త ఫ్లాగ్‌ షిప్ స్మార్ట్‌ ఫోన్ సిరీస్ ఇండియన్ మార్కెట్లో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఈ ఫోన్ లాంచ్ టీజర్ తో స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో చర్చ కూడా మొదలయ్యింది. ముఖ్యంగా, ఈ Vivo X500 Series సిరీస్‌ కు సంబంధించిన ధరలు లాంచ్‌ కు ముందే ఆన్‌ లైన్‌ లో లీక్ కావడం ఈ చర్చకు ప్రధాన కారణం చెప్పొచ్చు. ఈ సిరీస్‌ లో వివో X500, వివో X500 ప్రో, వివో X500 ప్రో మాక్స్ వంటి మోడళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం లీక్స్ ఉందని తెలుస్తోంది.

Vivo X500 Series లీక్డ్ ప్రైస్ ఏమిటి?

లీకైన వివరాల ప్రకారం, వివో X500 12GB RAM మరియు 256GB స్టోరేజ్ కలిగిన వేరియంట్ ధర రూ.1,19,999 గా ఉండవచ్చని సమాచారం. అలాగే, వివో X500 ప్రో యొక్క ఇదే స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,49,999 గా ఉండే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. చివరిగా, వివో X500 ప్రో మాక్స్ 12GB RAM మరియు 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.1,59,999 రూపాయలుగా 512GB వేరియంట్ ధర రూ.1,79,999 రూపాయలుగా ఉండవచ్చని లీక్స్ ద్వారా తెలుస్తోంది. ఈ సిరీస్‌ లోని ప్రత్యేక మాస్టర్ సెట్ ధర ఏకంగా రూ.2,29,999 రూపాయలుగా ఉండొచ్చని లీకులు చెబుతున్నాయి.

Vivo X500 Series : ఫీచర్లు

ఇక ఈ అప్ కమింగ్ సిరీస్ ఫీచర్ల విషయానికి వస్తే వివో X500 లో 6.59 ఇంచుల 1.5K OLED డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన స్క్రీన్ ఉంటుంది. ఈ సిరీస్ ఫోన్ లలో Dimensity 9600M ప్రాసెసర్ ఉంటుంది. అలాగే, ఈ సిరీస్ లో 7,500mAh బ్యాటరీ ఉండవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. ఇక X500 ప్రో మోడల్‌ ఫోన్ లో 6.36 ఇంచుల LTPO OLED డిస్‌ప్లే ఉంటుంది. ఈ ఫోన్ Dimensity 9600 Pro చిప్‌ సెట్ మరియు 6,510 mAh బ్యాటరీని అందించే అవకాశం ఉంది.

ఇక టాప్ మోడల్ ఫోన్ ఫీచర్స్ చూస్తే, X500 ప్రో మాక్స్ లో 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.85 ఇంచుల 2K LTPO OLED డిస్‌ప్లే మరియు 8,000mAh భారీ బ్యాటరీ ఉండొచ్చు. కెమెరా పరంగా, ఈ ఫోన్ లో 200MP పెరిస్కోప్ కెమెరా ఉండవచ్చని సమాచారం. 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లభించవచ్చని తెలుస్తోంది.

లాంచ్ ఎప్పుడు?

ఆన్లైన్ లీకుల ప్రకారం ఈ సిరీస్ నవంబర్ చివరి వారంలో భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, లాంచ్ తేదీ, ధరలు, ఫీచర్ల పై వివో నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాబట్టి, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ధర మరియు స్పెసిఫికేషన్ల వంటి వాటిని అంచనా వివరాలుగా మాత్రమే పరిగణించాలి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile