లేటెస్ట్ Noise 5.1 Dolby Atmos సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ సేల్ బిగ్ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది.!
ఫ్లిప్ కార్ట్ సేల్ Noise 5.1 Dolby Atmos సౌండ్ బార్ పై బిగ్ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది
బిగ్ బ్యాంగ్ దివాళి 2026 సేల్ నుంచి ఈ బిగ్ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది
డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో పండుగ సందర్భంగా చాలా రీజనబుల్ ధరలో సేల్ చేస్తోంది

లేటెస్ట్ Noise 5.1 Dolby Atmos సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ సేల్ బిగ్ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది. దీపావళి పండుగ సందర్భంగా తీసుకొచ్చిన బిగ్ బ్యాంగ్ దివాళి 2026 సేల్ నుంచి ఈ బిగ్ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. అదేమిటంటే, గత నెలలో నోయిస్ సరికొత్తగా విడుదల చేసిన 5.1 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ని మంచి డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో పండుగ సందర్భంగా చాలా రీజనబుల్ ధరలో సేల్ చేస్తోంది.
Noise 5.1 Dolby Atmos సౌండ్ బార్ : ఆఫర్
నోయిస్ గత నెల Homestage సిరీస్ నుంచి 5.1 మరియు 5.2.4 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ లను లాంచ్ చేసింది. ఈ రెండు సౌండ్ బార్ లలో 5.1 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ని ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్ తో మంచి పండుగ ఆఫర్ ధరలో ఫ్లిప్ కార్ట్ సేల్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ ని గత నెల రూ. 14,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో భారత్ మార్కెట్ లో విడుదల చేసింది.
ఇక ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ పై ఈరోజు పండుగ సేల్ నుంచి రూ. 1,000 డిస్కౌంట్ అందించి రూ. 13,999 రూపాయల పండుగ సేల్ ప్రైస్ తో సేల్ చేస్తోంది. ఇది కాకుండా రూ. 1,250 రూపాయల SBI క్రెడిట్ అండ్ డెబిట్ కార్డు డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ ని మీరు కేవలం రూ. 12,749 రూపాయల ఆఫర్ ధరలో మీ సొంతం చేసుకోవచ్చు.
Noise 5.1 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ నోయిస్ లేటెస్ట్ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో ముందు నాలుగు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు మరియు ప్రీమియం డిజైన్ కలిగిన సౌండ్ బార్, పవర్ ఫుల్ బాస్ సౌండ్ అందించే డౌన్ ఫైరింగ్ సబ్ ఉఫర్ తో పాటు రియర్ సరౌండ్ సౌండ్ కోసం డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు ఉన్నాయి. ఈ కంప్లీట్ స్పీకర్ సెటప్ తో ఈ నోయిస్ సౌండ్ బార్ 500W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ముఖ్యంగా, యూజర్ అభిరుచికి తగ్గట్లు ఎంచుకునేలా బ్లాక్ అండ్ సిల్వర్ రెండు కలర్ లలో ఈ సౌండ్ బార్ లభిస్తుంది.
ఈ సౌండ్ బార్ 5.1 డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన స్పీకర్ సెటప్ అండ్ సౌండ్ టెక్ తో ఆకట్టుకునే సరౌండ్ అండ్ బూమ్ బాస్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇది HDMI Arc, బ్లూటూత్, USB, AUX మరియు ఆప్టికల్ ఇన్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది.

