BSNL Offer: మరో వారం రోజుల్లో ముగియనున్న దీపావళి పండుగ ఆఫర్ మిస్ చేసుకోకండి.!
బిఎస్ఎన్ఎల్ అందించిన దీపావళి పండుగ ఆఫర్ మరో వారం రోజుల్లో క్లోజ్ అవుతుంది
ఈ ఆఫర్ తో ఎటువంటి ఖర్చు లేకుండా 24 రోజులు అన్లిమిటెడ్ లాభాలను యూజర్లు అందుకోవచ్చు
ఈ నెల 9వ తారీకు తో ఈ ప్లాన్ కోసం బిఎస్ఎన్ఎల్ ప్రకటించిన గడువు ముగుస్తుంది
BSNL Offer: దేశంలో ఏ ఇతర టెలికాం కంపెనీ అందించిన విధంగా బిఎస్ఎన్ఎల్ అందించిన ఒక ఆఫర్ మరో వారం రోజుల్లో క్లోజ్ అవుతుంది. ఈ ఆఫర్ తో ఎటువంటి ఖర్చు లేకుండా 24 రోజులు అన్లిమిటెడ్ లాభాలను యూజర్లు అందుకోవచ్చు. ఈ ఆఫర్ గతంలో కూడా అందుబాటులో ఉన్నా కూడా ఈ నెల 9వ తారీకు తో ఈ ప్లాన్ కోసం బిఎస్ఎన్ఎల్ ప్రకటించిన గడువు ముగుస్తుంది. ఇది బిఎస్ఎన్ఎల్ అందించిన లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కాబట్టి ఈ ఆఫర్ ముగిసేలోపే అందుకోవలసి ఉంటుంది.
SurveyBSNL Offer: ఏమిటి ఈ ఆఫర్?
దేశంలో కేవలం 3g సేవలకు మాత్రమే పరితమైన బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ కంపెనీలతో కలిసికట్టుగా 4g నెట్ వర్క్ ని దేశం మొత్తం విస్తరించింది. ఈ విస్తరణ తర్వాత బిఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ పైన పెరిగిన సబ్ స్క్రిప్షన్ లను దృష్టిలో ఉంచుకుని, బిఎస్ఎన్ఎల్ యూజర్ ని మరింత విస్తరించే కార్యక్రమంలో భాగంగా ఈ కొత్త ఆఫర్ ని అందించింది. అదే, బిఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ఆఫర్ మరియు ఈ ఆఫర్ ని కేవలం రూ. 1 రూపాయి రీఛార్జ్ తో అందించింది.

ఈ ఆఫర్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు కేవలం 1 రూపాయికే నెల రోజుల అనిలిమిటెడ్ లాభాలు అందించింది. అయితే, ఈ ఆఫర్ ను మధ్యలో కొన్ని రోజులు పక్కన పెట్టింది. కానీ, 2026 నుంచి ఈ ప్లాన్ ను మరోసారి అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ఈ ఆఫర్ ని నవంబర్ 9వ తేదీతో క్లోజ్ చేయబోతున్నట్లు బిఎస్ఎన్ఎల్ తెలిపింది. అంటే, 2026 దీపావళి పండుగ తర్వాత ఈ ఆఫర్ ని క్లోజ్ చేస్తోంది. కాబట్టి, మరో వారం రోజుల్లో ఈ బిఎస్ఎన్ఎల్ జబర్దస్త్ ఆఫర్ క్లోజ్ అవుతుంది. మరో వారం రోజుల్లో ముగియనున్న ఈ బిగ్ ఆఫర్ మిస్ చేసుకోకండి.
BSNL Offer: అందించే లాభాలు ఏమిటి?
బిఎస్ఎన్ఎల్ అందించిన ఈ ఒక్క రూపాయి ఆఫర్ తో రీచార్జ్ చేసే యూజర్లకు 24 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. కేవలం వ్యాలిడిటీ మాత్రమే కాదు ఈ పూర్తి చెల్లుబాటు కాలానికి రోజుకు 1జీబీ హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS వినియోగ ప్రయోజనం కూడా అందిస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ ప్లాన్ తో వచ్చే డైలీ 1 జీబీ హై స్పీడ్ డేటా ముగిసిన తర్వాత 40 Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా కూడా అందిస్తుంది.
Also Read: boAt 5.2 Dolby Atmos సౌండ్ బార్ ఊహించనంత తక్కువ ధరకే అందుకోండి .. పండుగ ఆఫర్.!
బిఎస్ఎన్ఎల్ ఆఫర్ ఎవరికి వర్తిస్తుంది?
బిఎస్ఎన్ఎల్ యూజర్లు అందరికీ ఈ ప్లాన్ వర్తించదు. బిఎస్ఎన్ఎల్ అందించిన ఈ ఒక్క రూపాయి ఆఫర్ కేవలం బిఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ కార్డు తీసుకుని ఫస్ట్ రీఛార్జ్ చేసే వారికి మాత్రమే రూ. 1 ప్లాన్ తో వర్తిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
