ChatGPT Images 2.6: ఇక ఫొటోలతో GIF లు కూడా క్రియేట్ చేయొచ్చు.!
Open AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మరో కీలక అప్ డేట్ తీసుకొచ్చింది
ChatGPT Images 2.5 విడుదలైన రెండు నెలల వ్యవధిలోనే Images 2.6 పేరుతో కొత్త ఇమేజ్ జనరేషన్ మోడల్
మెరుగైన ఫొటో ఎడిటింగ్ తో పాటు GIF జనరేషన్ వంటి కొత్త సదుపాయాలను అందిస్తోంది

ChatGPT Images 2.6: ప్రపంచ టెక్ దిగ్గజం Open AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మరో కీలక అప్ డేట్ తీసుకొచ్చింది. ChatGPT Images 2.5 విడుదలైన రెండు నెలల వ్యవధిలోనే Images 2.6 పేరుతో కొత్త ఇమేజ్ జనరేషన్ మోడల్ కూడా పరిచయం చేసింది. చాట్ జిపిటి అందించిన కొత్త అప్ డేట్ లో వేగవంతమైన ఇమేజ్ క్రియేషన్, మెరుగైన ఫొటో ఎడిటింగ్ తో పాటు GIF జనరేషన్ వంటి కొత్త సదుపాయాలను అందిస్తోంది.
ChatGPT Images 2.6: కొత్త అప్ డేట్
రెండు నెలల క్రితం మెరుగైన ఇమేజ్ క్రియేషన్ కోసం చాట్ జిపిటి ఇమేజెస్ 2.5 ని పరిచయం చేసింది. అయితే, ఇప్పుడు ఈ మోడల్ నెక్స్ట్ జనరేషన్ మోడల్ ని కూడా పరిచయం చేసింది. అదే ఇమేజెస్ 2.6 మోడల్ మరోయు ఇది మరింత అడ్వాన్స్ గా ఉంది. ముఖ్యంగా, సాధారణ ఫొటోలను యానిమేటెడ్ GIF లుగా మార్చుకునే అవకాశం ఈ మోడల్ ద్వారా వినియోగదారులకు పరిచయం చేసింది.
OpenAI అధికారిక సమాచారం ప్రకారం ChatGPT, Codex మరియు API ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రతి వారం 4 బిలియన్లకు పైగా ఇమేజ్ లను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో క్రియేటర్ల అవసరాలకు అనుగుణంగా ఈ కొత్త ఫీచర్లను తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది.
రెట్టింపు వేగంతో ఇమేజ్ జనరేషన్
ఈ కొత్త అప్ డేట్ లో అత్యంత ఆసక్తికరమైన ఫీచర్ GIF క్రియేషన్అని మాత్రమే అనుకోకండి. కొత్త అప్ డేట్ తో రెట్టింపు వేగంతో ఇమేజ్ జనరేషన్ ఆఫర్ చేస్తుంది. మీరు ఈ కొత్త మోడల్ తో గిఫ్ క్రియేట్ చేయటానికి ఒక సాధారణ ఫొటోను అప్ లోడ్ చేసి దానికి కదలికలు జోడించమని సూచించవచ్చు. అలాగే, టెక్స్ట్ ప్రాంప్ట్ ద్వారా కూడా కొత్త యానిమేటెడ్ GIF లను రూపొందించవచ్చు.
ఉదాహరణకు ఒక వ్యక్తి నవ్వడం, కార్టూన్ క్యారెక్టర్ నడవడం, బ్రాండ్ మస్కట్ చేతులు ఊపడం వంటి యానిమేషన్లను తయారు చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాదు మీరు క్రియేట్ చేసే GIF ప్లే బ్యాక్ వేగాన్ని మార్చడం, వ్యక్తిగత ఫ్రేమ్ లను ఎడిట్ చేయడం మరియు వాటిని షేర్ చేసుకోవడం వంటి అద్భుతమైన సదుపాయాలు కూడా యూజర్లకు అందుబాటులోకి వస్తున్నాయి.
ChatGPT Images 2.6 ఎవరికి అందుబాటులో ఉంటుంది?
OpenAI అధికారిక ప్రకటన ప్రకారం, ఈ కొత్త ఇమేజెస్ 2.6 ప్రపంచవ్యాప్తంగా ChatGPT సబ్ స్క్రిప్షన్ ప్లాన్లలో ఉన్న వెబ్, డెస్క్టాప్ మరియు మొబైల్ కోసం కూడా ఇది అందుబాటులోకి వచ్చింది. GIF క్రియేషన్ ఫీచర్ మాత్రం దశలవారీగా విడుదలవుతోంది. డెవలపర్లు API ద్వారా కొత్త Flare, Sunburst మోడళ్లను ఉపయోగించుకోవచ్చు. మొత్తంగా ఈ అప్ డేట్ కంటెంట్ క్రియేటర్లు, డిజైనర్లు, సోషల్ మీడియా వినియోగదారులకు ఫొటోలతో పాటు యానిమేటెడ్ కంటెంట్ తయారీలో కొత్త అవకాశాలను జోడిస్తుంది.
