BSNL OFFER: 24 రోజుల అన్లిమిటెడ్ లాభాలు అందించే రూ. 1 ఆఫర్ నేటితో ముగుస్తుంది.!
BSNL అందిస్తున్న రూ.1 ప్రత్యేక సిమ్ ఆఫర్ కి నేటితో అనగా, నవంబర్ 9 గడువు ముగియనుంది
తక్కువ ధరకే మొబైల్ కనెక్షన్ తీసుకోవాలనుకునే కొత్త కస్టమర్లకు ఈ ఆఫర్ మంచి అవకాశం
24 రోజుల పాటు కాలింగ్, డేటా, SMS ప్రయోజనాలు పొందవచ్చు

BSNL OFFER: ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అందిస్తున్న రూ.1 ప్రత్యేక సిమ్ ఆఫర్ కి నేటితో అనగా, నవంబర్ 9 గడువు ముగియనుంది. తక్కువ ధరకే మొబైల్ కనెక్షన్ తీసుకోవాలనుకునే కొత్త కస్టమర్లకు ఈ ఆఫర్ మంచి అవకాశంగా నిలుస్తోంది. Freedom 2.0 పేరుతో బిఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ప్రమోషనల్ ఆఫర్ ద్వారా కేవలం ఒక్క రూపాయితో కొత్త BSNL సిమ్ తీసుకుని 24 రోజుల పాటు కాలింగ్, డేటా, SMS ప్రయోజనాలు పొందవచ్చు. అయితే, ఈ ఆఫర్ ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ నంబర్ ఉపయోగిస్తున్న వారికి వర్తించదు. కేవలం కొత్తగా కనెక్షన్ తీసుకునే వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.
BSNL OFFER: రూ.1 ప్లాన్ ప్రయోజనాలు?
రూ.1 ప్లాన్ ప్రయోజనాల విషయానికి వస్తే, బిఎస్ఎన్ఎల్ Freedom 2.0 ఆఫర్ లో భాగంగా కొత్త కస్టమర్లకు 24 రోజుల సర్వీస్ వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ 24 రోజుల కాల వ్యవధిలో దేశవ్యాప్తంగా అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. అలాగే, ప్రతిరోజూ 1GB హై స్పీడ్ డేటా, రోజుకు 100 SMS లు కూడా పొందుతారు. అంటే, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 24 రోజుల వ్యవధిలో మొత్తం 24 GB డేటా మరియు 2,400 SMS లు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, నేషనల్ రోమింగ్ సమయంలో కూడా అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయం పొందవచ్చు.
BSNL OFFER ఎవరు పొందవచ్చు?
బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.1 ఆఫర్ కేవలం కొత్త బిఎస్ఎన్ఎల్ మొబైల్ కనెక్షన్ తీసుకునే వినియోగదారుల కోసం మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ సిమ్ ఉపయోగిస్తున్న వారు తమ ప్రస్తుత నంబర్ పై ఈ ఆఫర్ ను రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉండదు. ఒకసారి కొత్త సిమ్ పై ఈ ప్రత్యేక ఆఫర్ పొందిన వారికి మళ్లీ ఈ ఆఫర్ అందుబాటులో ఉండదని గమనించాలి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.
View full profile