Vivo X500 Series ఇండియా లాంచ్ అనౌన్స్ .. న్యూ డిజైన్ అండ్ న్యూ కెమెరా సెటప్ తో వస్తోంది.!
Vivo X500 Series ఇండియా లాంచ్ కోసం వివో ఇప్పుడు టీజింగ్ స్టార్ట్ చేసింది
సిరీస్ కోసం వివో ఇండియన్ మార్కెట్లో కొత్త హైపర్ క్రియేట్ చేస్తోంది
గొప్ప కెమెరాతో లాంచ్ అయ్యే అవకాశం ఉందని మనం కచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు

Vivo X500 Series ఇండియా లాంచ్ కోసం వివో ఇప్పుడు టీజింగ్ స్టార్ట్ చేసింది. అప్ కమింగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ కోసం వివో ఇండియన్ మార్కెట్లో కొత్త హైపర్ క్రియేట్ చేస్తోంది. వివో X సిరీస్ అంటేనే కెమెరా కోసం ప్రత్యేకమైన స్మార్ట్ ఫోన్స్ గా మార్కెట్లో ఒక గట్టి ముద్ర వేశాయి. ఇప్పటికే వచ్చిన అన్ని ఫోన్లు కూడా మార్కెట్లో గొప్ప కెమెరా ఫోన్స్ గా నిలిచాయి. ఇప్పుడు వివో లాంచ్ చేయబోతున్న ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ కూడా ఇదే దారిలో గొప్ప కెమెరాతో లాంచ్ అయ్యే అవకాశం ఉందని మనం కచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు.
Vivo X500 Series లాంచ్ డేట్ ఏమిటి?
వివో ఎక్స్ 500 సిరీస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ని ఇంకా అనౌన్స్ చేయలేదు. అంటే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ఇండియా లాంచ్ డేట్ ని వివో ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గ్లింప్స్ మాత్రం వెల్లడించింది. ఈ ఫోన్ లాంచ్ కోసం అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి కూడా టీజర్ ని రిలీజ్ చేసింది. అయితే, నిజానికి ఈ సిరీస్ ఫోన్లను 2026 సెప్టెంబర్ నెల చివరిలో చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. అయితే, ఇప్పుడు ఈ సిరీస్ ను ఇప్పుడు ఇండియాలో లాంచ్ చేస్తోంది.
Vivo X500 Series ప్రత్యేకతలు ఏమిటి?
వివో ఎక్స్ 500 సిరీస్ స్మార్ట్ ఫోన్ లాంచ్ లో భాగంగా విడుదల చేసిన టీజర్ ఇమేజ్ అండ్ వివరాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోన్ గత సిరీస్ కంటే మెరుగైన డిజైన్ మరియు వెనుక మరింత సుందరమైన డిజైన్ తో ఉన్నట్లు క్లియర్ గా కనిపిస్తోంది. ఈ ఫోన్ సరికొత్త రెడ్ ఆరంజ్ కలర్ లో మెరిసిపోతోంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ రౌండ్ కార్నర్ మరియు పైన కార్నర్ లో పెద్ద ఫ్లాష్ లైట్ తో కొత్తగా కనిపిస్తుంది.
ఈ ఫోన్ డిజైన్ అండ్ వివరాలు చూస్తుంటే, ఈ ఫోన్ చైనా మార్కెట్లో లాంచ్ అయిన అదే ఫోన్ మాదిరిగా అనిపిస్తోంది. ఇదే గనుక నిజం అయితే, ఈ ఫోన్ అద్భుతమైన కెమెరా ఫోన్ గా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Vivo X500 Series : చైనా వేరియంట్ ఫీచర్స్
వివో చైనా మార్కెట్ లో ఈ సిరీస్ నుంచి Vivo X500, Vivo X500 Pro, Vivo X500 Pro Max అనే మూడు మోడళ్లను అందించింది. ఈ ఫోన్ సిరీస్ ను కెమెరా, బ్యాటరీ మరియు పెర్ఫార్మెన్స్ పై ఎక్కువ ద్రుష్టి సారించి కంపెనీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి అందించినట్లు చెప్పవచ్చు. ఈ ఫోన్స్ ఇప్పటికే చైనా మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి.
వివో X500 ప్రో మరియు ప్రో మాక్స్ మోడళ్లను 2nm టెక్నాలజీతో రూపొందించిన MediaTek Dimensity 9600 Pro ప్రాసెసర్ అందించింది. ప్రో మాక్స్ ఫోన్ 6.85 అంగుళాల 2K BOE OLED డిస్‌ప్లేని 144Hz రిఫ్రెష్ రేట్ తో అందించింది. ఇందులో 200MP ZEISS APO టెలిఫోటో కెమెరా, 8,000mAh బ్యాటరీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అలాగే 4K 240 fps స్లో మోషన్ వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఈ ఫోన్ లో హైలెట్. ఇక ప్రో మోడల్ లో 6.36 అంగుళాల డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ సిరీస్ లో అన్ని ఫోన్లు కూడా Origin OS 7 పై నడుస్తాయి.
అయితే, ఈ ఫోన్ ఇండియాలో ఇదే ఫీచర్స్ తో లాంచ్ అవుతుందా? ఇంకా ఏమైనా మార్పులా ఉంటాయని ఇంకా తెలియలేదు. కంపెనీ అఫీషియల్ గా టీజింగ్ చేసే వరకు ఈ ఫీచర్స్ గురించి మనం పూర్తిగా చెప్పలేము.

