Digit.in

Jailer 2 OTT Release: ఓటీటీలో రిలీజైన రజనీకాంత్ 'జైలర్ 2' సినిమా.. ఎక్కడ చూడాలంటే.!

Highlights

'జైలర్ 2' ఈరోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ అవుతోంది

భారత్‌ తో పాటు 240 కి పైగా దేశాలు మరియు ప్రాంతాల్లో డిజిటల్ ప్రీమియర్

తెలుగు ప్రేక్షకులు కూడా తమకు నచ్చిన భాషలో ఈ సినిమాను వీక్షించవచ్చు

Jailer 2 OTT Release: ఓటీటీలో రిలీజైన రజనీకాంత్ 'జైలర్ 2' సినిమా.. ఎక్కడ చూడాలంటే.!

Jailer 2 OTT Release: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్ 2' సినిమా ఈరోజు అనగా, 12 నవంబర్ 2026 నుంచి ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. భారత్‌ తో పాటు 240 కి పైగా దేశాలు మరియు ప్రాంతాల్లో ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ అయ్యింది. ఈ హై వోల్టేజ్ యాక్షన్ సినిమాని తెలుగు ప్రేక్షకులు కూడా తమకు నచ్చిన భాషలో ఈ సినిమాను వీక్షించవచ్చు.

Jailer 2 OTT Release

జైలర్ 2 సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్ ఫామ్ లో ఈరోజు రిలీజ్ అయ్యింది. సబ్ స్క్రిబర్స్ ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియో లో వీక్షించవచ్చు. ప్రస్తుతం అమెజాన్ తన ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ని కేవలం రూ. 799 రూపాయల బడ్జెట్ వన్ ఇయర్ ప్లాన్ తో కూడా అందిస్తోంది.

Jailer 2 OTT Release

ఈ సినిమా థియేటర్స్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. రజినీకాంత్ అద్భుతమైన నటన, మంచి థ్రిల్లింగ్ గా ఉండే సినిమా కథ మరియు కథలో పాత్రలు ఈ సినిమా ముందు ప్రేక్షకులను కట్టి పడేశాయి.

జైలర్ 2 సినిమా కథ ఏమిటి?

2023 లో విడుదలైన 'జైలర్' సినిమాకు కొనసాగింపుగా ఈ రెండో భాగాన్ని రూపొందించారు. ఇందులో రజనీకాంత్ మరోసారి రిటైర్డ్ జైలర్ టైగర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో మెరిసిపోయారు. కుటుంబంతో ప్రశాంతంగా జీవించాలనుకునే ముత్తువేల్ పాండియన్ జీవితంలోకి ఓ శక్తివంతమైన క్రిమినల్ నెట్‌ వర్క్ ప్రవేశిస్తుంది. తన కుటుంబానికి ముప్పు ఎదురు కావడంతో ఆయన మళ్లీ తన పాత శైలిలో రంగంలోకి దిగాల్సి వస్తుంది. పాత శత్రువులు, కొత్త ముఠాలు మరియు ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య ఆయన చేసే పోరాటమే ఈ చిత్రంలోని ప్రధాన కథాంశం.

జైలర్ 2 నటీనటులు

ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌ పై కళానిధి మారన్ ఈ సినిమా నిర్మించారు. రజనీకాంత్‌ తో పాటు రమ్యకృష్ణ, యోగిబాబు, ఎస్.జే. సూర్య, విద్యాబాలన్, మిథున్ చక్రవర్తి, సూరజ్ వెంజరమూడు కీలక పాత్రల్లో నటించారు. అలాగే, మోహన్‌లాల్, శివరాజ్‌ కుమార్, విజయ్ సేతుపతి, హృతిక్ రోషన్ ప్రత్యేక పాత్రల్లో కనిపించడం ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. జైలర్ సినిమా అనగానే ముందుగా గుర్తొచ్చేది బ్యాగ్రౌండ్ మ్యూజిక్. జైలర్ 2 సినిమా కోసం కూడా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు మరియు మరోసారి అదరగొట్టారు.

ఓటీటీలో మిస్ కాకూడదా?

సుమారు 2 గంటల 43 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా థియేటర్లలో మంచి వసూళ్లను సాధించింది. ముఖ్యంగా రజనీకాంత్ స్టైల్, భారీ యాక్షన్ సన్నివేశాలు, ఇతర భాషలకు చెందిన ప్రముఖ నటుల ప్రత్యేక పాత్రలు ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెంచాయి. థియేటర్లలో సినిమా చూడలేకపోయిన అభిమానులకు ఇప్పుడు ఓటీటీ లో చూసే అవకాశం లభించింది. జైలర్ మొదటి భాగం కూడా ప్రైమ్ వీడియో లో అందుబాటులో ఉంది. కాబట్టి, జైలర్ మరియు జైలర్ 2 రెండు సినిమాలను ఒకే ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ లో చూసే అవకాశం ప్రేక్షకులకు లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile