Lava Smart 4 Pro vs Karbonn Rebel vs Vivo T5e ఫోన్లలో రూ.14 వేల లోపు బెస్ట్ బడ్జెట్ ఫోన్ ఏది.!
స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి మార్కెట్లో పలు ఆప్షన్స్ మీకు అందుబాటులో ఉన్నాయి
బడ్జెట్ ధరలో లావా స్మార్ట్ 4 ప్రో లాంచ్ తో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ విభాగంలో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది
Lava Smart 4 Pro vs Karbonn Rebel vs Vivo T5e మూడు ఫోన్ లలో ఏది బెటర్

బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి మార్కెట్లో పలు ఆప్షన్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. అయితే, బడ్జెట్ ధరలో లావా స్మార్ట్ 4 ప్రో లాంచ్ తో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ విభాగంలో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న కార్బన్ రెబల్ మరియు వివో T5e మోడళ్లకు ఇది పోటీగా నిలుస్తోంది. Lava Smart 4 Pro vs Karbonn Rebel vs Vivo T5e మూడు ఫోన్ లలో ఏది తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లు అందిస్తోందో తెలుసుకోండి. ఇందులో కెమెరా, ప్రాసెసర్, బ్యాటరీ పరంగా ఏది మెరుగ్గా ఉందో చూద్దాం.
Lava Smart 4 Pro vs Karbonn Rebel vs Vivo T5e: ధరలు
ముందుగా ఈ మూడు స్మార్ట్ ఫోన్ ప్రైస్ వివరాల్లోకి వెళితే, లావా స్మార్ట్ 4 ప్రో బేసిక్ వేరియంట్ రూ.10,999 ధరలో లభిస్తుంది. అలాగే, కార్బన్ రెబల్ బేసిక్ వేరియంట్ రూ.11,999 ధరలో మరియు వివో T5e బేసిక్ వేరియంట్ రూ. 13,999గా ధరలో లభిస్తుంది. ఈ లిస్ట్ లో ధర పరంగా లావా మోడల్ చౌకైన ఫోన్ గా నిలుస్తోంది. ప్రైస్ సరే ఈ ఫోన్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
Display
లావా స్మార్ట్ 4 ప్రో అండ్ కార్బన్ రెబల్ రెండింటిలోనూ 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.75 ఇంచుల HD+ డిస్ప్లే ఉంటుంది. వీటిలో లావా స్మార్ట్ 4 ప్రో ఫోన్ Unisoc T610 తో నడుస్తుంది మరియు కార్బన్ రెబల్ MediaTek Helio G81 ప్రాసెసర్ తో నడుస్తుంది. ఈ ఫోన్ వివో T5e లో 6.74 ఇంచుల HD+ LCD డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది మరియు ఇది Unisoc T7225 చిప్ సెట్ తో నడుస్తుంది.
Camera అండ్ Battery
కెమెరా విషయానికి వస్తే, కార్బన్ రెబల్ లో 50MP ప్రధాన కెమెరా ఉంది. అలాగే, లావా స్మార్ట్ 4 ప్రో లో 13MP కెమెరా మరియు వివో T5e లో 8MP వెనుక కెమెరా ఉన్నాయి. ఈ మూడు ఫోన్లలోనూ 5MP సెల్ఫీ కెమెరా ఉంది. బ్యాటరీ పరంగా Lava, Karbonn ఫోన్లు 7,000mAh బ్యాటరీ మరియు 18W ఛార్జింగ్ సపోర్ట్ ఉండగా, వివో T5e లో 5,500mAh బ్యాటరీ మరియు 15W ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
ఏది కొనాలి
లావా స్మార్ట్ 4 ప్రో అండ్ కార్బన్ రెబల్ ఫోన్లు Android 16 ఆధారిత క్లీన్ UI తో వస్తాయి. వివో T5e ఫోన్ Origin OS 6 తో వస్తుంది. ఎక్కువ బ్యాటరీ, 50MP కెమెరా కావాలనుకునేవారికి కార్బన్ ఫోన్ మంచి ఆప్షన్ అవుతుంది. అయితే, తక్కువ ధరలో ఫోన్ కావాలంటే లావా స్మార్ట్ 4 ప్రో మరియు వివో సాఫ్ట్ వేర్ అనుభవం కోరుకునేవారికి వివో T5e పరిశీలించదగిన మోడల్స్.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.
View full profile
