Flipkart SASA LELE Sale: భారీ ఆఫర్లు మరియు డీల్స్ తో కొత్త సేల్ అనౌన్స్ చేసిన ఫ్లిప్ కార్ట్.!
ఫ్లిప్ కార్ట్ తన అప్ కమింగ్ బిగ్ సేల్ ను అనౌన్స్ చేసింది
Flipkart SASA LELE Sale ను భారీ ఆఫర్లు మరియు డీల్స్ తో తీసుకొస్తుంది
SBI క్రెడిట్ కార్డ్స్ తో ప్రోడక్ట్స్ కొనుగోలు చేసే యూజర్లకు 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తుంది
Flipkart SASA LELE Sale: ఫ్లిప్ కార్ట్ తన అప్ కమింగ్ బిగ్ సేల్ ను అనౌన్స్ చేసింది. అదే ఫ్లిప్ కార్ట్ సాసా లేలే సేల్ మరియు ఈ సేల్ ను భారీ ఆఫర్లు మరియు డీల్స్ తో తీసుకొస్తుంది. ఈ సేల్ నుంచి స్మార్ట్ ఫోన్ లను భారీ డిస్కౌంట్ తో అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ గొప్పగా చెబుతోంది. ఈ అప్ కమింగ్ సేల్ కోసం అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుంచి ఈ సేల్ డీల్స్ కోడోత్ రివీల్ చేసింది.
SurveyFlipkart SASA LELE Sale: ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?
ఫ్లిప్ కార్ట్ అప్ కమింగ్ సేల్ మే 9వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. అయితే, ఫ్లిప్ కార్ట్ బ్లాక్ మరియు ప్లస్ కస్టమర్లకి ఒకరోజు ముందుగా, అంటే 8వ తేదీ నుంచి సేల్ ప్రారంభం అవుతుంది. ఈ సేల్ ను SBI బ్యాంక్ భాగస్వామ్యంతో ఫ్లిప్ కార్ట్ తీసుకొచ్చింది. అందుకే, ఈ సేల్ నుంచి SBI క్రెడిట్ కార్డ్స్ తో ప్రోడక్ట్స్ కొనుగోలు చేసే యూజర్లకు 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తుంది.
Flipkart SASA LELE Sale: ఆఫర్స్
ఫ్లిప్ కార్ట్ తీసుకొస్తున్న ఈ లేటెస్ట్ సేల్ నుంచి లేటెస్ట్ అండ్ టాప్ స్మార్ట్ ఫోన్ లను సైతం మంచి ఆఫర్ ధరలో అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ చెబుతోంది. ఈ సేల్ కోసం అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుంచి బెస్ట్ డీల్స్ లిస్ట్ కూడా అందించింది. అంతేకాదు, మే 1వ తేదీ నుంచి ఈ సేల్ నుంచి అందించే టాప్ స్మార్ట్ ఫోన్ డీల్స్ కూడా రివీల్ చేస్తుంది.

ఇక ప్రసుతం ఫ్లిప్ కార్ట్ రివీల్ చేసిన టాప్ డీల్స్ విషయానికి వస్తే, ఈ అప్ కమింగ్ సేల్ నుంచి ఐఫోన్ 17, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25, మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో, నథింగ్ ఫోన్ (4a) స్మార్ట్ ఫోన్ లను ముందెన్నడూ చూడని డిస్కౌంట్ ధరలో అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ చెబుతోంది. అంతేకాదు, ఈ సేల్ నుంచి ఏకంగా కోటి రూపాయల విలువైన కూపన్స్ కూడా అందించబోతున్నట్లు ఫ్లిప్ కార్ట్ తెలిపింది.
Also Read: iQOO Neo 10: సెగ్మెంట్ ఫాస్ట్ ఫోన్ గా కొత్త వేరియంట్ లాంచ్ అనౌన్స్ చేసిన ఐకూ.!
ఈ సేల్ నుంచి అందించే అదనపు డీల్స్ గురించి కూడా ఫ్లిప్ కార్ట్ వివరాలు వెల్లడించింది.ఈ సేల్ నుంచి అదనపు డిస్కౌంట్ అందించే కూపన్స్, ఎక్స్ చేంజ్ డీల్స్, అడిషనల్ కూపన్స్ బ్యాంక్ ఆఫర్స్ మరియు No Cost EMI వంటి ఆఫర్స్ అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ తెలిపింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile