Realme GT 7T ఫోన్ పై రూ. 8,400 రూపాయల భారీ డిస్కౌంట్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్.!

HIGHLIGHTS

రియల్ మీ GT సిరీస్ ఫోన్ ను గొప్ప డిస్కౌంట్ ధరలో అందుకునే అవకాశం మీ కోసం ఎదురు చూస్తోంది

Realme GT 7T ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు రూ. 8,400 రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది

రియల్ మీ ఈ ఫోన్ ను Dimensity 8400-Max చిప్‌ సెట్ తో అందించింది

Realme GT 7T ఫోన్ పై రూ. 8,400 రూపాయల భారీ డిస్కౌంట్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్.!

రియల్ మీ లేటెస్ట్ GT సిరీస్ స్మార్ట్ ఫోన్ ను గొప్ప డిస్కౌంట్ ధరలో అందుకునే అవకాశం మీ కోసం ఎదురు చూస్తోంది. ఎందుకంటే, Realme GT 7T ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు రూ. 8,400 రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ ఈరోజు ప్రకటించిన ఈ బిగ్ డిస్కౌంట్ ఆఫర్ తో 35 వేల రూపాయల ప్రైస్ కలిగిన స్మార్ట్ ఫోన్ ను కేవలం 26 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకోవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme GT 7T: ఆఫర్

రియల్ మీ జిటి 7టి స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రూ. 34,999 ప్రైస్ ట్యాగ్ లాంచ్ అయ్యింది. అయితే, ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 7,000 భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 27,999 రూపాయల ఆఫర్ ధరకే. ఇది కాకుండా ఈ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ Axis మరియు ఫ్లిప్ కార్ట్ SBI క్రెడిట్ కార్డు ఆప్షన్ పై రూ. 1,400 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ రియల్ మీ మిడ్ రేంజ్ ఫోన్ కేవలం రూ. 26,599 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ప్రైస్ లో ఇది బెస్ట్ డీల్ గా నిలుస్తుంది.

Also Read: Motorola Edge 70 Pro Sale: ఫస్ట్ సేల్ నుంచి బిగ్ లాంచ్ ఆఫర్స్ అందుకోండి.!

Realme GT 7T: ఫీచర్స్

ఈ రియల్ మీ స్మార్ట్ ఫోన్ 6.8 అంగుళాల AMOLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 1.5K రిజల్యూషన్, డాల్బీ విజన్ సపోర్ట్, HDR10+ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. రియల్ మీ ఈ ఫోన్ ను Dimensity 8400-Max చిప్‌ సెట్ తో అందించింది. ఇది 4nm టెక్నాలజీ చిప్ సెట్ మరియు గరిష్టంగా 1.7Mn+ AnTuTu స్కోర్ అందిస్తుంది. ఈ ఫోన్ 8GB LPDDR5X ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

Realme GT 7T flipkart offer

ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఇందులో 50MP మెయిన్ (Sony IMX896, OIS) కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగి ఉంటుంది కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో ఉన్న సెల్ఫీ మరియు మెయిన్ రెండు కెమెరాలు కూడా 4K 60fps వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటాయి. ఈ ఫోన్ 7000mAh భారీ బ్యాటరీ మరియు 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo