Flipkart Sale నుంచి కేవలం 23 వేలకే లేటెస్ట్ 50 ఇంచ్ QLED Smart Tv అందుకోండి.!
Flipkart Sale నుంచి ఈరోజు బిగ్ స్మార్ట్ టీవీ డీల్ ని అనౌన్స్ చేసింది
ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసిన బిగ్ బిలియన్ డేస్ సేల్ ఎర్లీ బర్డ్ డీల్స్ ఈరోజు నుంచి స్టార్ట్ చేసింది
ఈ స్మార్ట్ టీవీన ఈరోజు 50% భారీ డిస్కౌంట్ తో కేవలం బడ్జెట్ ప్రైస్ ట్యాగ్ తో సేల్ అవుతోంది
Flipkart Sale నుంచి ఈరోజు బిగ్ స్మార్ట్ టీవీ డీల్ ని అనౌన్స్ చేసింది. ఏమిటి కొత్త సేల్ అనుకుంటున్నారా? 2026 దసరా పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసిన బిగ్ బిలియన్ డేస్ సేల్ ఎర్లీ బర్డ్ డీల్స్ ఈరోజు నుంచి స్టార్ట్ చేసింది. ఈ సేల్ నుంచి ఈరోజు కేవలం 23 వేలకే లేటెస్ట్ 50 ఇంచ్ QLED Smart Tv ని అందుకునే అవకాశం అందించింది. ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించిన ఈ డీల్ మరియు ఈ టీవీ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.
Surveyఫ్లిప్ కార్ట్ అందించిన QLED Smart Tv ఆఫర్ ఏమిటి?
TOSHIBA కొత్తగా VIDAA సిరీస్ నుంచి లేటెస్ట్ గా విడుదల చేసిన 50 ఇంచ్ FHD క్యూలెడ్ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ బిగ్ డీల్స్ అందించింది. ఈ టీవీని ఎర్లీ బర్డ్ డీల్స్ గా అందించింది. డీల్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీని ఈరోజు 50% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 25,249 ప్రైస్ ట్యాగ్ తో సేల్ చేస్తోంది.

ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై రూ. 2,000 భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. ఈ టీవీని ఫ్లిప్ కార్ట్ నుంచి ఈరోజు ICICI మరియు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి ఈ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఎర్లీ బర్డ్ డీల్స్ తో కేవలం రూ. 23,249 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.
50 ఇంచ్ QLED Smart Tv : ఫీచర్స్
ఈ తోషిబా స్మార్ట్ టీవీ 50 ఇంచ్ పరిమాణం కలిగిన క్యూలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ Full HD (1920 x 1080) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ Regza ఇంజిన్ తో వస్తుంది మరియు జతగా 1 జీబీ ర్యామ్ మరియు ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ టీవీ HDR 10, HLG మరియు డాల్బీ విజన్ వంటి ఫీచర్స్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. అంతేకాదు, ఈ టీవీ AI సౌండ్ మరియు AI పిక్చర్ వంటి ఆకట్టుకునే ఏఐ ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 20W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ డాల్బీ అట్మోస్, డాల్బీ ఆడియో మరియు డీటీఎస్ సౌండ్ టెక్ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ బిల్ట్ ఇన్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB, ఈథర్నెట్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ VIDAA U9 OS తో నడుస్తుంది. ఈ టీవీ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు యూట్యూబ్ హాట్ కీస్ కలిగిన ప్రీమియం రిమోట్ తో ఈ ఫోన్ వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
