Xiaomi 18 Pro Max Special Edition ని పూర్తి ట్రాన్స్పరెంట్ డిజైన్ మరియు అబ్బురపరిచే ఫీచర్స్ తో లాంచ్ చేసింది.!
Xiaomi 18 Pro Max Special Edition అబ్బురపరిచే ఫీచర్స్ తో లాంచ్ చేసింది
ఈ ఫోన్ ను లేటెస్ట్ ఐఫోన్ 18 మాక్స్ తో పోటీపడే ఫీచర్స్ తో అందించినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి
ఈ ఫోన్ ను క్వాల్‌కామ్ Snapdragon 8 Elite Extreme Gen 6 ప్రాసెసర్ తో పరిచయం చేసింది
Xiaomi 18 Pro Max Special Edition ని పూర్తి ట్రాన్స్పరెంట్ డిజైన్ మరియు అబ్బురపరిచే ఫీచర్స్ తో లాంచ్ చేసింది. అయితే, షియోమీ ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతానికి కేవలం చైనా మార్కెట్ లో మాత్రమే విడుదల చేసింది. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ లాంచ్ గురించి ఎటువంటి ప్రకటన ఇంకా చేయలేదు. అయితే, ఈ ఫోన్ ను లేటెస్ట్ ఐఫోన్ 18 మాక్స్ తో పోటీపడే ఫీచర్స్ తో అందించినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరి చైనా మార్కెట్లో షియోమీ లేటెస్ట్ గా విడుదల చేసిన ఈ స్పెషల్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ వివరాలు చూద్దామా.
SurveyXiaomi 18 Pro Max Special Edition : ప్రైస్ (చైనా)
షియోమీ 18 ప్రో మాక్స్ స్పెషల్ ఎడిషన్ ను 16GB ర్యామ్ మరియు 1TB ఇంటర్నల్ స్టోరేజ్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను చైనా మార్కెట్ లో 10,999 yuan ధరతో లాంచ్ చేసింది. ఇది ఇండియాలో సుమారు రూ. 1,57,000 రూపాయలు గా ఉంటుంది. ఇది ప్రీమియం సెగ్మెంట్ ఫోన్ గా ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.
Xiaomi 18 Pro Max Special Edition : ఫీచర్స్
షియోమీ 18 ప్రో మాక్స్ స్పెషల్ ఎడిషన్ రెడ్ వేరియంట్ ని మైక్రాన్ లెవెల్ ఫిలిం ప్రాసెస్ ద్వారా రూపొందించిన ప్రత్యేకమైన 3D టెక్స్చర్డ్ రెడ్ ట్రాన్స్పరెంట్ కలర్ తో అందించింది. ఇది ఫోన్ ను ను పూర్తిగా పారదర్శకంగా చేసింది, ఈ ఫోన్ లో ముందు 6.9 అంగుళాల LTPO OLED ప్యానెల్ ఉంటుంది. ఇది 2K రిజల్యూషన్, 1-120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, M11 లైట్ ఎమిషన్ మరియు 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది కాకుండా ఈ ఫోన్ లో వెనుక 2.9 అంగుళాల OLED స్క్రీన్ ఉంటుంది. ఇది కూడా 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.

షియోమీ ఈ ఫోన్ ను క్వాల్‌కామ్ Snapdragon 8 Elite Extreme Gen 6 ప్రాసెసర్ తో పరిచయం చేసింది. ఇది 2nm టెక్నాలజీ చిప్ సెట్ మరియు జతగా 16GB LPDDR5X RAM తో అత్యున్నతమైన పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. అంతేకాదు, ఇందులో 1TB UFS 4.1ఫాస్ట్ అండ్ బిగ్ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంది. ఈ ఫోన్ వేగంగా పని చేసేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా చేసే 5,513mm² హీట్ డిస్సిపేషన్ ఏరియాతో సర్క్యులర్ కోల్డ్ పంప్ కూలింగ్ సెటప్ కూడా అందించింది.
ఈ ఫోన్ లో ప్రీమియం కెమెరా సెటప్ ని అందించింది. ఇందులో హైపర్ OIS సపోర్ట్ కలిగిన 200MP (లైకా సమిలక్స్ లెన్స్) ని జతగా 200MP పెరిస్కోప్ లెన్స్ మరియు 50MP అల్ట్రా వైడ్ కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా వుంది. అలాగే, ఈ ఫోన్ లో 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఇది అత్యద్భుతమైన క్వాలిటీ ఇమేజ్ మరియు వీడియో అందిస్తుంది.
ఈ ఫోన్ ను 8,500mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు 27W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను Dolby Atmos మరియు Hi-Res ఆడియో సపోర్ట్ కలిగిన 3-స్పీకర్ సెటప్ తో అందించింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
