iQOO Neo 10: సెగ్మెంట్ ఫాస్ట్ ఫోన్ గా కొత్త వేరియంట్ లాంచ్ అనౌన్స్ చేసిన ఐకూ.!
iQOO Neo 10 కొత్త వేరియంట్ లను లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్
సెగ్మెంట్ ఫాస్ట్ ఫోన్ గా ఐకూ నియో 10 ఫోన్ ను పరిచయం చేసింది
ఇది ఫ్లాగ్ షిప్ స్థాయి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది మరియు 144FPS గేమింగ్ కి సపోర్ట్ చేస్తుంది
iQOO Neo 10: 2025 ఇండియన్ మార్కెట్లో సెగ్మెంట్ ఫాస్ట్ ఫోన్ గా ఐకూ నియో 10 ఫోన్ ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో మంచి అమ్మకాలు కూడా అందించింది. ఈ ఫోన్ ను గతంలో రెండు కలర్ వేరియంట్స్ లో మత్రమే కంపెనీ అందించింది. అయితే, ఈ ఫోన్ యొక్క రెండు కొత్త వేరియంట్ లను ఇప్పుడు లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది.
SurveyiQOO Neo 10: కొత్త వేరియంట్ లాంచ్ డేట్
ఐకూ నియో 10 ఫోన్ కొత్త వేరియంట్ లను ఏప్రిల్ 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. అంటే, ఈ ఫోన్ కొత్త వేరియంట్స్ మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లో విడుదల చేయబడతాయి. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకంగా అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు కలర్ వేరియంట్ వివరాలు అందించింది.
iQOO Neo 10: ఫీచర్స్
ఐకూ ముందుగా ఈ ఫోన్ యొక్క ఇన్ఫెర్నో రెడ్ మరియు టైటానియం క్రోమ్ రెండు కలర్ వేరియంట్స్ అందించింది. ఇప్పుడు ఆల్ స్పైన్ వైట్ మరియు ఆస్పాల్ట్ బ్లాక్ రెండు కొత్త కలర్ వేరియంట్స్ లాంచ్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ రేపటి నుంచి మొత్తం నాలుగు కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.

ఇక ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే ని 1.5K రిజల్యూషన్ మరియు 144Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ 5500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు ఐ ప్రొటెక్షన్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8s Gen 4 ప్రోసెసర్ మరియు జతగా iQOO Q1 సూపర్ కంప్యూటింగ్ చిప్ తో పని చేస్తుంది. ఇది ఫ్లాగ్ షిప్ స్థాయి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది మరియు 144FPS గేమింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
Also Read: Realme GT 7T ఫోన్ పై రూ. 8,400 రూపాయల భారీ డిస్కౌంట్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్.!
కెమెరా విభాగంలో, ఈ ఫోన్ 50MP Sony OIS మెయిన్ కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ తో డ్యూయల్ రియర్ మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది మరియు లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 7000mAh భారీ బ్యాటరీ మరియు 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. 7000mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం కూడా కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile