UPI MDR 2026 కొత్త రూల్ సాధారణ యూజర్ల పై ఎంత ప్రభావం చూపుతుంది.!

HIGHLIGHTS

భారతదేశం డిజిటల్ చెల్లింపులకు ప్రపంచ ఖ్యాతి తెచ్చింది UPI అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

చెల్లింపులకు సంబంధించి కొత్త విధానం 2026 అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానుంది

UPI MDR 2026 కొత్త రూల్ సాధారణ యూజర్ల పై ఎంత ప్రభావం చూపుతుంది

UPI MDR 2026 కొత్త రూల్ సాధారణ యూజర్ల పై ఎంత ప్రభావం చూపుతుంది.!

భారతదేశం డిజిటల్ చెల్లింపులకు ప్రపంచ ఖ్యాతి తెచ్చింది UPI అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక చిన్న కూరగాయల దుకాణం నుంచి ఇకార్ట్ సైట్స్ లో ఆన్‌ లైన్ షాపింగ్ వరకు అనేక చోట్ల ప్రజలు UPI ను ఉపయోగిస్తున్నారు. అయితే, ఇప్పుడు యుపిఐ వ్యాపారి చెల్లింపులకు సంబంధించి కొత్త విధానం 2026 అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానుంది. కొత్త నిబంధన ప్రకారం, రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన వ్యాపార లావాదేవీలపై 0.3 నుంచి 0.4 శాతం MDR వర్తిస్తుంది. అయితే, ఇది చాలా మందికి పూర్తిగా అర్థం కావడం లేదని తెలుస్తోంది. అందుకే, UPI MDR 2026 కొత్త రూల్ సాధారణ యూజర్ల పై ఎంత ప్రభావం చూపుతుందని వివరంగా తెలిపే వివరణ ఇక్కడ అందించాము.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

UPI MDR 2026 కొత్త రూల్

కొత్త ఎండీఆర్ విధానం అనేది కేవలం వ్యాపారులకు చెల్లించే రుసుము అని చెబుతాను. అంటే, మీరు వ్యక్తి నుంచి వ్యక్తికి (P2P) డబ్బులు పంపిస్తే మీకు ఎటువంటి ఛార్జ్ లు వర్తించవు మరియు ఈ చెల్లింపులు పూర్తిగా ఉచితం. అంతేకాదు, రూ. 2,000 రూపాయల కంటే తక్కువ పేమెంట్ చేసినా కూడా మీకు ఛార్జ్ లు వర్తించవు. మీరు వ్యాపారికి చేసే రూ, 2,000 లు లేదా అంతకన్నా ఎక్కువ పేమెంట్ కి మాత్రమే 0.4% ఎండీఆర్ వర్తిస్తుంది. అయితే, ఇది రూ. 75,000 రూపాయలు లేదా అంత కన్నా పైబడిన పేమెంట్ కోసం కూడా రూ. 300 రూపాయల పరిమితిని వర్తింప చేసింది.

అసలు MDR అంటే ఏమిటి?

ఎండీఆర్ అంటే మర్చంట్ డిస్కౌంట్ రేట్ అని ఫుల్ ఫామ్ లో చెబుతారు. అంటే, ఒక కస్టమర్ UPI ద్వారా వ్యాపారికి డబ్బు చెల్లించినప్పుడు, ఆ పేమెంట్‌ ను నిర్వహించే సిస్టంలోని సంస్థలకు వర్తించే రుసుమును ఎండీఆర్ అని అంటారు.

ఇది ప్రభుత్వం కోసం వసూలు చేసే పన్నులు కాదు అని గమనించాలి. ఇది బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, UPI యాప్ సంస్థలు వంటి పేమెంట్ ఎకోసిస్టమ్‌లోని భాగస్వాముల కోసం వసూలు చేసే రుసుము మరియు ఈ రుసుము వారికి పంపిణీ అవుతుంది. డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలు, భద్రత, సేవల నిర్వహణకు మద్దతు ఇవ్వడం ఈ కొత్త విధానం యొక్క ప్రధాన లక్ష్యాల్లో ఒకటి అని ప్రభుత్వం వివరించింది.
రూ. 2,000 కంటే ఎక్కువ UPI పేమెంట్ పై ఎంత చార్జీ వర్తిస్తుంది?

Also Read: Annadhanam Spots: తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఉచిత ‘అన్న ప్రసాదం అప్డేట్స్’ కోసం ప్రత్యేకమైన వెబ్ సైట్.!

ఈ ప్రశ్న ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే, ఏ పేమెంట్ కు ఎంత చెల్లించాల్సి వస్తుందో అని ప్రజలు లెక్కలు కడుతున్నారు. అందుకే, సింపుల్ గా అర్ధం కావడానికి మీకు ఇక్కడ ఒక వివరణ అందించాము.

పేమెంట్ మొత్తం0.4% లెక్క
రూ.3,000రూ.12
రూ.5,000రూ.20
రూ.10,000రూ.40
రూ.25,000రూ.100
రూ.50,000రూ.200
రూ.75,000రూ.300
రూ.1,00,000రూ.300 గరిష్ట పరిమితి

అయితే, ఇక్కడ అందించిన 0.4% ఎండీఆర్ వర్తించే విధానం గురించి మాత్రమే వెల్లడించారు. ప్రతి లావాదేవీకి ఇదే విధానం వర్తిస్తుందని మీరు భావించకూడదు. ప్రత్యేక రంగాలు, మినహాయింపులు, వ్యాపారి కేటగిరీ వంటి అంశాల ఆధారంగా ఈ నిబంధనలు మారవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile