MOTOROLA Buds 2 Fusion రేపటి నుంచి సేల్ అవుతుంది.. ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!

HIGHLIGHTS

MOTOROLA Buds 2 Fusion రేపటి నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది

కొత్త బడ్స్ ను 55dB ANC మరియు 12.4mm Titanium డ్రైవర్ వంటి ప్రీమియం ఫీచర్స్ తో విడుదల చేసింది

ఈ బడ్స్ 53 గంటల ప్లే బ్యాక్ అందించే బ్యాటరీ కలిగి ఉంటుంది

MOTOROLA Buds 2 Fusion రేపటి నుంచి సేల్ అవుతుంది.. ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!

MOTOROLA Buds 2 Fusion రేపటి నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ కొత్త బడ్స్ ని మోటోరోలా చాలా సైలెంట్ గా విడుదల చేసింది మరియు రేపటి నుంచి ఈ బడ్స్ సేల్ కూడా ప్రారంభం అవుతుంది. ఈ కొత్త బడ్స్ ను 55dB ANC మరియు 12.4mm Titanium డ్రైవర్ వంటి ప్రీమియం ఫీచర్స్ తో విడుదల చేసింది. ఈ బడ్స్ సేల్ కంటే ముందు ఈ బడ్స్ ప్రైస్ అండ్ కంప్లీట్ ఫీచర్స్ పై ఒక లుక్కేయండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

MOTOROLA Buds 2 Fusion: ప్రైస్

మోటోరోలా బడ్స్ 2 ఫ్యూజన్ ఇయర్ బడ్స్ ను కేవలం రూ. 1,999 ధరతో లాంచ్ చేసింది. ఈ బడ్స్ ను ఫ్లిప్ కార్ట్ పే లేటర్ ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 100 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ బడ్స్ కేవలం రూ. 1,899 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది. ఈ బడ్స్ ను పాంటోన్ లారెల్ గ్రీన్, పాంటోన్ సర్ఫ్ ది వెబ్ మరియు పాంటోన్ టాప్ షూ మూడు రంగుల్లో లాంచ్ చేసింది. ఈ బడ్స్ ను మోటోరోలా అధికారిక వెబ్సైట్ మరియు ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ చేస్తుంది.

MOTOROLA Buds 2 Fusion: ఫీచర్స్

మోటోరోలా బడ్స్ 2 ఫ్యూజన్ ట్రూ వైర్లెస్ బడ్స్ ని ‘నో నాయిస్ ఆల్ స్టైల్’ క్యాప్షన్ తో రిలీజ్ చేసింది. క్యాప్షన్ లో చెప్పినట్లు, ఈ బడ్స్ ను చాలా స్టైలిష్ డిజైన్ లో అందించింది. ఇది ఏర్గోనమిక్ ఫిట్, కాంపాక్ట్ సైజ్ మరియు పాంటోన్ కాలర్స్ తో అందించింది. ఈ బడ్స్ ను గొప్ప సౌండ్ అందించే 12.4mm టైటానియం కోటెడ్ డైనమిక్ డ్రైవర్స్ తో అందించింది. ఇది మంచి డీప్ బాస్ మరియు గొప్ప క్వాలీటి సౌండ్ అందిస్తుందని మోటోరోలా తెలిపింది.

MOTOROLA Buds 2 Fusion

ఈ బడ్స్ ను ఈ ప్రైస్ సెగ్మెంట్ లో 55dB అడాప్టివ్ ANC ఫీచర్ తో అందించడం విశేషం. ఇది వెలుపలి శబ్దాలను పూర్తిగా తగ్గించి చాలా క్లీన్ సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, ఈ బడ్స్ 6 మైక్ సెటప్ తో మంచి కాలింగ్ సౌకర్యం కూడా అందిస్తుందని మోటోరోలా తెలిపింది. అలాగే, మ్యూజిక్ మరియు ఆడియోని మరింత స్టేబుల్ గా అందించడానికి లేటెస్ట్ Bluetooth 6.0 కనెక్టివిటీ ఫీచర్ కలిగి ఉంది.

Also Read: Vivo V80: వివో అప్ కమింగ్ ప్రీమియం ఫోన్ ఇండియా లాంచ్ కన్ఫర్మ్ చేసిన వివో.!

ఈ బడ్స్ కలిగిన ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ బడ్స్ 53 గంటల ప్లే బ్యాక్ అందించే బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇది కేస్ మరియు బడ్స్ తో కలిసి టోటల్ టైం అని గమనించాలి. ఈ బడ్స్ మోటో బడ్స్ యాప్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఇందులో డ్యూయల్ డివైజ్ కనెక్షన్, స్పేషియల్ ఆడియో మరియు AAC అండ్ SBC ఫీచర్స్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile