Vivo V80: వివో అప్ కమింగ్ ప్రీమియం ఫోన్ ఇండియా లాంచ్ కన్ఫర్మ్ చేసిన వివో.!

HIGHLIGHTS

అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివో 80 ఇండియా లాంచ్ కన్ఫర్మ్ చేసింది

V సిరీస్ నెక్స్ట్ జనరేషన్ ఫోన్ గా ఈ ఫోన్ ను లాంచ్ చేస్తుంది

ఈ ఫోన్ ను సరికొత్త ఆరంజ్ కలర్ లో పరిచయం చేస్తోంది

Vivo V80: వివో అప్ కమింగ్ ప్రీమియం ఫోన్ ఇండియా లాంచ్ కన్ఫర్మ్ చేసిన వివో.!

Vivo V80: వివో ఇండియాలో విడుదల చేయబోతున్న అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివో 80 ఇండియా లాంచ్ కన్ఫర్మ్ చేసింది. ప్రీమియం ఫీచర్స్ తో మార్కెట్ ను ఆకట్టుకునే ఫీచర్స్ తో ఫోన్ అందించే వి సిరీస్ నెక్స్ట్ జనరేషన్ ఫోన్ గా ఈ ఫోన్ ను లాంచ్ చేస్తుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ మును వివో ఇప్పటి వరకు ఆఫర్ చేయని సరికొత్త ఆరంజ్ కలర్ లో పరిచయం చేస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Vivo V80: లాంచ్ డేట్

వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివో వి80 లాంచ్ డేట్ ను ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అయితే, ఈ ఇండియా లాంచ్ మాత్రం కన్ఫర్మ్ చేసింది. అంటే, ఈ ఫోన్ ను ఇండియాలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ గత సిరీస్ కంటే మరింత పవర్ ఫుల్ కెమెరా మరియు ఫీచర్స్ తో లాంచ్ అవుతుందని వివో టీజింగ్ చేస్తోంది.

Vivo V80: ఫీచర్స్

వివో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఇంకా రివీల్ చేయలేదు. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా ప్రత్యేకంగా అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ ఫీచర్స్ లిస్ట్ తో టీజింగ్ చేసింది. అయితే, ఈ ఫీచర్ లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపింది.

Vivo V80

వివో వి 80 స్మార్ట్ ఫోన్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ ఫోన్ టీజర్ లో అందించిన టీజర్ ఇమేజ్ చూస్తుంటే, ఇది దాదాపు ఐఫోన్ 17 ప్రో మాదిరి డిజైన్ తో ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే, ఈ ఫోన్ కొత్త ఆరంజ్ కలర్ లో వెనుక పెద్ద కెమెరా బంప్ వంటి ఫీచర్స్ కలిగి ఉండటమే ఇందుకు కారణంగా అనిపిస్తుంది. ఈ ఫోన్ లో వెనుక ZEISS లోగో తో ట్రిపుల్ రియర్ కెమెరా మరియు LED ఫ్లాష్ ఉన్నాయి.

Also Read: Oppo K14 Lite స్మార్ట్ ఫోన్ 7000 mAh బిగ్ బ్యాటరీ అండ్ స్టైలిష్ డిజైన్ తో వచ్చింది.!

ఈ అప్ కమింగ్ వివో ఫోన్ సినిమాటిక్ కెమెరాతో వస్తోందని వివో ఈ ఫోన్ గురించి ప్రత్యేకంగా చెబుతోంది. ఇదే కాదు ఈ ఫోన్ లో ప్రత్యేకమైన AI Camera ఫీచర్స్ ఉన్నాయని కూడా వివో చెబుతోంది. అలాగే, ఈ ఫోన్ లో V సిరీస్ లో ఎన్నడూ చూడని బిగ్ బ్యాటరీ ఉందని కూడా వివో చెబుతోంది. ఈ వివరాలు ఈ ఫోన్ గురించి ఇప్పటి వరకు తెలిసిన వివరాలు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile