Oppo K14 Lite స్మార్ట్ ఫోన్ 7000 mAh బిగ్ బ్యాటరీ అండ్ స్టైలిష్ డిజైన్ తో వచ్చింది.!
ఒప్పో కొత్త స్మార్ట్ ఫోన్ Oppo K14 Lite ను ఈరోజు ఇండియాలో విడుదల చేసింది
ఈ స్మార్ట్ ఫోన్ ను 7000mAh బిగ్ బ్యాటరీ అండ్ స్టైలిష్ డిజైన్ తో రిలీజ్ చేసింది
లాంచ్ చేయడమే కాకుండా ఇదే రోజు నుంచి సేల్ కి కూడా అందుబాటులోకి తెచ్చింది.
Oppo K14 Lite: ఒప్పో కొత్త స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలో 7000mAh బిగ్ బ్యాటరీ అండ్ స్టైలిష్ డిజైన్ తో రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ను రెండు సరికొత్తగా రంగుల్లో కూడా అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను రోజు లాంచ్ చేయడమే కాకుండా ఇదే రోజు నుంచి సేల్ కి కూడా అందుబాటులోకి తెచ్చింది.
SurveyOppo K14 Lite: ప్రైస్
ఒప్పో ఈ ఫోన్ ను రూ. 16,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ తో రూ. 1,000 రూపాయల తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఫోన్ ఈ రోజు నుండి ఒప్పో అఫీషియల్ సైట్ మరియయు ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా వచ్చింది. ఈ ఫోన్ ను రెండు అందమైన సరికొత్త రంగుల్లో అందించింది.
Oppo K14 Lite: ఫీచర్స్
ఒప్పో కే 14 లైట్ స్మార్ట్ ఫోన్ ను 6.5 ఇంచ్ IPS LCD స్క్రీన్ తో అందించింది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, అల్ట్రా బ్రైట్నెస్ మరియు HD+ రిజల్యూషన్ వాటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ని Unisoc T7250 చిప్ సెట్ తో లాంచ్ చేసింది. అలాగే, ఈ ఫోన్ లో 4 జీబీ ఫిజికల్ ర్యామ్, 4 జీబీ వర్చువల్ ర్యామ్ మరియు 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందించింది. ఈ ఫోన్ లేటెస్ట్ కలర్ OS జతగా ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ మూడు సంవత్సరాల స్మూత్ పర్ఫార్మెన్స్ అందిస్తుందని ఒప్పో తెలిపింది. అయితే, ఇది ఇది 4G స్మార్ట్ ఫోన్ అని గమనించాలి.

కెమెరా పరంగా, ఈ ఫోన్ లో వెనుక 13MP AI డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 5MP సెల్ఫీ కెమెరా కలిగి ఉన్నాయి. ఈ ఫోన్ కలిగిన కెమెరా సెటప్ తో FHD వీడియో రికార్డింగ్ మరియు లేటెస్ట్ ఏఐ కెమెరా సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కలిగిన బ్యాటరీ ఈ ఫోన్ లో ప్రత్యేకమైన సెటప్ అవుతుంది, ఎందుకంటే, ఒప్పో ఈ ఫోన్ ను 7000 mAh భారీ బ్యాటరీతో ఈ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఒప్పో అందించింది.
Also Read: 5.2.4 True Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ అతి భారీ డిస్కౌంట్ అందుకోండి.!
ఈ ఫోన్ ను IP 64 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో ఒప్పో విడుదల చేసింది. ఈ ఫోన్ స్ప్లాష్ టచ్, ఆయిలీ హ్యాండ్ టచ్ మరియు గ్లోవ్ టచ్ వంటి స్క్రీన్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
