Annadhanam Spots: తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఉచిత ‘అన్న ప్రసాదం అప్డేట్స్’ కోసం ప్రత్యేకమైన వెబ్ సైట్.!

Annadhanam Spots: తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఉచిత ‘అన్న ప్రసాదం అప్డేట్స్’ కోసం ప్రత్యేకమైన వెబ్ సైట్.!

Annadhanam Spots: సిద్దార్థ్ మరియు జెనీలియా మొదటి సినిమా Boys లో పిచ్చగా నవ్వించిన గుడ్ లో ఉచిత అన్న ప్రసాదం కామెడీ సీన్ మీకు గుర్తుందా? ఇప్పుడు సరిగ్గా ఆ కామెడీ నిజం చేస్తూ ఒక కొత్త వెబ్సైట్ వెలసింది. ప్రముఖ కమెడియన్ సెంథిల్ ఈ మూవీలో ఏ గుడిలో ఎప్పుడు ప్రసాదం పెడతారు అని పెద్ద బుక్ రాసుకొని, ఆ లిస్ట్ ప్రకారం సంవత్సరం మొత్తం అన్నదాన ప్రసాదం తో కాలం గడపడం మరియు తన వద్దకు వచ్చిన వారికి కూడా ఇదే లిస్ట్ తో కరువు నింపడం, ఆ సీన్స్ చాలా హాస్యం పండించింది. పైగా జ్ఞాన సముపార్జన గొప్ప వరం అని వేదాంతం కూడా చెబుతారు, ఇప్పుడు ఇదే విధంగా ఒక వెబ్సైట్ ఆన్లైన్ లో అందుబాటులో ఉంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Annadhanam Spots: ఏమిటి ఈ వెబ్ సైట్

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గుళ్ళు మరియు గణపతి నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన కార్యక్రమాలతో సహా ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఉచిత ‘అన్న ప్రసాదం అప్డేట్స్’ కోసం ఈ వెబ్సైట్ ను రూపొందించారు. ఇందులో మరింత మంచి విషయం ఏమిటంటే, ఇది ఓపెన్ కమ్యూనిటీ సర్వీస్. అంటే, ఇందులో ఎవరైనా సరే తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఉచిత అన్న ప్రసాదం స్పాట్ ను పోస్ట్ చేయవచ్చు. ఈ వెబ్సైట్ తో పాటు ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను కూడా ఈ సైట్ తరపున ఓపెన్ చేశారు. ‘Spread food Spread Kindness’ క్యాప్షన్ తో ఈ సైట్ ను రన్ చేస్తున్నారు.

Annadhanam Spots

ఇది మీకు దగ్గరలో జరిగే అన్న ప్రసాదం కార్యక్రమం వివరాలు మీకు అందిస్తుంది. అంతేకాదు, సెర్చ్ లోకి వెళ్లి ప్రాంతం వివరాలు సెర్చ్ చేస్తే కూడా అక్కడ అన్న ప్రసాదం ఏమైనా ఉంటే వివరాలు అందిస్తుంది. ఈ సైట్ పేరు ‘అన్న ప్రసాదం స్పాట్స్’ ఇది పేరుకు తగ్గట్టు అన్నదానం స్పాట్స్ వివరాలు అందిస్తుంది. అన్నానని బాధపడకుండా దేవుని ప్రసాదం తో కడుపు నింపడమే ఈ వెబ్సైట్ ముఖ్య ఉదేశ్యం. ఆలాగే, ఎవరైనా సరే వారి ప్రాంతంలో జరిగే అన్న ప్రసాదం స్పాట్ ను కూడా ఇక్కడ షేర్ చేయవచ్చు.

Also Read: MOTOROLA Buds 2 Fusion రేపటి నుంచి సేల్ అవుతుంది.. ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!

ఈ మంచి ఆలోచనకు హాట్స్ ఆఫ్ అని నెటిజన్లు ఈ సైట్ గురించి ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile