షావోమి, Mi Mix 3 స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది : నోచ్ తో పనిలేని పూర్తి స్క్రీన్ మరియు స్లైడింగ్ లో సెల్ఫీ కెమేరాలతో వస్తుంది
షావోమి నుండి మరొక హై ఎండ్ పరికరం రాబోతోంది, నోచ్ లేని ఫుల్ డిస్ప్లే తో.
షావోమి యొక్క గేమింగ్ ఫోన్ బ్లాక్ షార్క్ 2 ప్రకటించిన వారం తరువాత, Xiaomi Mi Mix 3 స్మార్ట్ ఫోన్ ని చైనాలో విడుదల చేసింది. ఈ కార్యక్రమం చైనా రాజధాని అయిన బీజింగ్ లో జరిగింది. ఈ స్మార్ట్ఫోన్ మేకర్, ఈ ఫోన్ యొక్క తాజా ప్రత్యేకతలను మరియు వివరాలను ప్రకటించింది. ఈ ఫోన్లో పూర్తి స్క్రీన్ అందించడం కోసం, నోచ్ తో పనిలేని ఒక స్లయిడింగ్ మెకానిజన్ని అందించినది. పాత రోజులను గుర్తుకు తెచ్చేలా ఈ స్లయిడింగ్ ఉంటుందని మరియు స్లయిడింగ్ చేయడం వలన ఎటువంటి ఇబ్బందీ ఉండదని, ఇంకా ఇది చాల కాలంవరకు మన్నికగా ఉండేలా తయారు చేశామని, CEO అయిన 'లీ జున్' తెలిపారు.
SurveyXiaomi Mi Mix 3 యొక్క ప్రత్యేకతలు
ఈ స్మార్ట్ ఫోన్ 1080x 2340 పిక్సల్స్ కలిగిన ఒక 6.4 అంగుళాల Full HD+ OLED డిస్ప్లే కలిగివుంటుంది. ఇది 19.5:9 యాస్పెక్ట్ రేషియోతో, 93.4 బాడీ నుండి స్క్రీన్ నిష్పత్తితో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ అడ్రినో 630 GPU జతగా, స్నాప్ డ్రాగన్ 845 SoC శక్తితోవస్తుంది మరియు అత్యధిక స్థాయిలో 10GB ర్యామ్ వరకు ఉంటుంది. ఇది MIUI 10 బేస్డ్ ఆండ్రాయిడ్ 8.1 ఓరెయో తో నడుస్తుంది మరియు డ్యూయల్ సిమ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా, ఈ స్మార్ట్ ఫోన్ 10W ఛార్జింగ్ వైర్లెస్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేసే ఒక 3850 mAh బయటరీతో వస్తుంది.+
ఈ ఫోన్ ఆప్టిక్స్ గురించి చూస్తే, ఈ స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో 12MP + 12MP డ్యూయల్ కెమెరాని కలిగి ఉంటుంది. ఈ డ్యూయల్ కెమెరాలో f /1.8 అపేర్చరు గల Sony IMX363 వైడ్ యాంగిల్ సెన్సార్ మరియు f /2.4 ఆపేర్చరు గల Samsung S5K3M3 మరియు 1- మైక్రాన్ పిక్సెల్ అందించగల టెలిఫోటో లెన్స్ కలిగి ఉంటుంది. అంతేకాకుండా, దీనితో AI బ్యాగ్రౌండ్ మ్యూజిక్, 960fps స్లో -మోషన్, AI సీన్ డిటెక్షన్, వంటి మరెన్నో ప్రయోజనాలను తెస్తుంది. ముందుభాగంలో, 1.8 – మైక్రా పిక్సెల్స్ అందించగల Sony IMX576 సెన్సార్ గల 24MP మరియు 2MP జతగా డ్యూయల్ కెమేరాతో వస్తుంది.
Xiaomi Mi Mix 3 ధరలు
చైనాలో, ఈ స్మార్ట్ఫోన్ యొక్క 6GB / 128GB మోడల్ CNY3,299 అనగా సుమారు 34,801 రూపాయలు. అలాగే, మరొక వేరియంట్ను 8GB / 128GB మరియు 8GB / 256GB లతో తీసుకొస్తే, దాని ధర CNY3,599 అనగా సుమారు 37,964 రూపాయలుగా నివేదించబడింది. అంతేకాకుండా, ఒక ప్రత్యేక ఎడిషన్ వేరియంట్ 10GB / 256GB మోడల్ CNY 4,999 వద్ద ధరతో ఉంది, ఇది సుమారు రూ ఇది 52,744 ధరగా ఉండవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
