OnePlus Nord CE6 Lite: వన్ ప్లస్ అప్ కమింగ్ ఫోన్ టాప్ ఫీచర్స్ ముందే తెలుసుకోండి.!

HIGHLIGHTS

OnePlus Nord CE6 Lite లాంచ్ కంటే ముందే మీ ముందుకు తీసుకొచ్చాము

ఈ ఫోన్ నార్డ్ CE సిరీస్ బడ్జెట్ ఫోన్ గా లాంచ్ అవుతుంది

మిడ్ రేంజ్ ఫోన్ వంటి ఫీచర్స్ తో దర్శనమిస్తోంది

OnePlus Nord CE6 Lite: వన్ ప్లస్ అప్ కమింగ్ ఫోన్ టాప్ ఫీచర్స్ ముందే తెలుసుకోండి.!

OnePlus Nord CE6 Lite: వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ నుంచి విడుదల చేయబోతున్న నార్డ్ సిఈ 6 లైట్ స్మార్ట్ ఫోన్ కీలకమైన మరియు టాప్ ఫీచర్స్ ను లాంచ్ కంటే ముందే మీ ముందుకు తీసుకొచ్చాము. ఈ ఫోన్ నార్డ్ CE సిరీస్ బడ్జెట్ ఫోన్ గా లాంచ్ అవుతుంది. అయితే, అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ మంచి ,మిడ్ రేంజ్ ఫోన్ వంటి ఫీచర్స్ తో దర్శనమిస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OnePlus Nord CE6 Lite: ఎప్పుడు లాంచ్ అవుతుంది?

వన్ ప్లస్ నార్డ్ CE 6 లైట్ స్మార్ట్ ఫోన్ 2026 మే 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో విడుదలవుతుంది. ఈ ఫోన్ తో పాటు వన్ వన్ ప్లస్ నార్డ్ CE 6 ఫోన్ కూడా లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ కోసం కంపెనీ ప్రత్యేకం అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ కీలక ఫీచర్స్ వన్ ప్లస్ విడుదల చేసింది.

OnePlus Nord CE6 Lite: టాప్ / కీలక ఫీచర్స్

వన్ ప్లస్ నార్డ్ CE 6 లైట్ యొక్క డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా మరియు OS వంటి కీలక వివరాలు వన్ ప్లస్ ముందే రివీల్ చేసింది. కంపెనీ ముందుగా వెల్లడించిన కీలక వివరాలు ఇప్పుడు చూద్దాం. కంపెనీ ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్ చాలా స్లీక్ అండ్ న్యూ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో 144Hz రిఫ్రెష్ రేట్ మరియు గొప్ప బ్రైట్నెస్ కలిగిన ఫ్లూయిడ్ డిస్ప్లే అవుంతుంది. ఇది గేమింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ కోసం తగిన బెస్ట్ డిస్ప్లే కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది.

OnePlus Nord CE6 Lite

ఇక ఫోన్ లో మెయిన్ ఫీచర్ ఈ ఫోన్ చిప్ సెట్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ను సెగ్మెంట్ ఫస్ట్ మీడియాటెక్ Dimensity 7400 APEX చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు వన్ ప్లస్ ప్రకటించింది. ఇది 10 లక్షల కంటే అధిక స్కోర్ అందించే చిప్ సెట్ మరియు దీనికి జతగా తగిన ర్యామ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ ను గొప్ప బ్యాటరీ సపోర్ట్ తో కూడా లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ 7000 mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ అవుతుంది. ఇది 6 సంవత్సరాల లాంగ్ బ్యాటరీ హెల్త్ కలిగిన గొప్ప బ్యాటరీ అని కూడా వన్ ప్లస్ తెలిపింది.

Also Read: ZEBRONICS 5.2 Dolby డ్యూయల్ సబ్ ఉఫర్ సౌండ్ బార్ అతి చవక ధరలో లభిస్తోంది.!

ఈ ఫోన్ కెమెరా వివరాలు కూడా వన్ ప్లస్ రివీల్ చేసింది. ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ సెటప్ లో 50MP ప్రధాన కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ మరియు లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను లేటెస్ట్ Oxygen OS 16 సాఫ్ట్ వేర్ తో లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ చేస్తుంది. వన్ ప్లస్ నార్డ్ CE 6 లైట్ ఫోన్ ను ఈ కీలక ఫీచర్స్ తో ఈ ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు వన్ ప్లస్ తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo