ఈరోజు నుండే VIVO S1 మొదటి సేల్ : ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్లలొ కూడా లభిస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్ ఒక ట్రిపుల్ కెమేరా మరియు ముందు వాటర్ డ్రాప్ డిజైనులో ఒక 32MP సెల్ఫీ కెమేరాతో వస్తుంది.
నిన్న జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా VIVO తన S సిరీస్ నుండి S1 స్మార్ట్ ఫోన్ను ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక ట్రిపుల్ కెమేరా మరియు ముందు వాటర్ డ్రాప్ డిజైనులో ఒక 32MP సెల్ఫీ కెమేరాతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్, మూడు రకాలైన వేరియంట్లలో విడుదలైయ్యింది మరియు ఆగష్టు 8 వ తేదీ, అంటే ఈరోజు నుండి ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ నుండి సేల్ జరగనుంది.
Surveyవివో ఎస్ 1 ధరలు మరియు ఆఫర్లు
1. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ – Rs.17,990/-
2. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ – Rs.18,990/-
3. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ – Rs.19,990/-
వివో ఎస్ 1 ఫీచర్లు మరియు ప్రత్యేకతలు
ఈ వివో ఎస్ 1 మొబైల్ ఫోన్ ఇండియా మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ వివో ఎస్ 1 ఫోన్ ఒక 6.38-అంగుళాల FHD + స్క్రీన్ తో వస్తుంది. ఇది సూపర్ AMOLED డిస్ప్లే మరియు ఇది ఒక వాటర్‌డ్రాప్ నోచ్ తో వస్తుంది. ఈ మొబైల్ ఫోన్ లో, మీడియా టెక్ ఇటీవలే ప్రవేశపెట్టిన మీడియాటెక్ హెలియో పి 65 ప్రాసెసర్ ని అందించింది, ఈ ప్రాసెసర్‌తో లాంచ్ చేసిన మొట్టమొదటి మొబైల్ ఫోన్. అదనంగా, ఇది 4GB/6GB RAM తో అనుసంధానం చెయ్యబడింది మరియు ఇది 64GB /128GB అంతర్గత స్టోరేజితో వస్తుంది. ఈ ఫోన్‌లో 4,500 ఎంఏహెచ్ సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ కూడా ఉంది.
ఇది కాకుండా మీరు ఫోటోగ్రఫీ కోసం వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ పొందుతారు. ఒక 16MP ప్రాధమిక సెన్సార్‌కి జతగా మరొక 8MP వైడ్ యాంగిల్ కెమెరాను మరియు ఒక 2MP డెప్త్ సెన్సార్ కూడా లభిస్తుంది. ఇది కాకుండా, మీకు ఈ ఫోన్‌లో 32 MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీల కోసం అందించబడింది. ఈ ఫోన్, ఫన్ టచ్ OS స్కిన్ పైన ఆండ్రాయిడ్ 9 ఫై ఆధారితంగా నడుస్తుంది. ఇది కేవలం 0.48 సెకన్లలో ఫోన్ అన్లాక్ చేయగల ఒక ఇన్- డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారుతో వస్తుంది. ఇది స్కై లైన్ బ్లూ మరియు డైమండ్ బ్లాక్ వంటి రెండు రంగుల ఎంపికలతో లభిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile