VIVO Y – సిరీస్ లో కొత్త Y8 4GB వేరియంట్ విడుదల మరియు ఆఫర్ల ప్రకటన

HIGHLIGHTS

ఈ Y8 (4GB) వేరియంట్ తో వివో తన Y - సిరీస్ ని విస్తరించింది. ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది.

VIVO Y – సిరీస్ లో కొత్త Y8 4GB వేరియంట్ విడుదల మరియు ఆఫర్ల ప్రకటన

మంచి అమ్మకాలు సాధించిన VIVO యొక్క Y81 3GB RAM కి వారసునిగా తీసుకొచ్చిన ఈ Y81 (4GB) వేరియంట్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది మరియు దీని ధర రూ. 13490 గ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ హీలియో P22 ఆక్టా కొర్ ప్రాసెసర్ శక్తితో వస్తుంది. ఈ ఫోన్ ఒక 6.22 అంగుళాల ఫుల్ వ్యూ డిస్ప్లే ని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఈ రోజు నుండి వివో ఇండియా e – స్టోర్, పేటిఎమ్ మాల్ మరియు అన్నిఆఫ్లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ ఫోన్ కెమెరా విభాగానికి వస్తే, ఇందులో 13MP  రియర్ కెమెరా మరియు 5MP సెల్ఫీ కెమెరాని అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ ని ఒక 3260 mAh బ్యాటరీ శక్తితో అందించారు మరియు ఇది బ్లాక్ మరియు గోల్డ్ వంటి, రెండు రంగులలో ఎంచుకునే విధంగా ఎంపికలతో వస్తుంది. అలాగే, కొత్తగా విడుదలైన ఈ Y81 (4GB) తో పాటుగా,Y 71i, Y83 ప్రో మరియు Y81 వంటి Y సిరీస్ ఫోన్ల మీద మంచి ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్ లో భాగంగా, హెచ్ డి ఎఫ్ సి కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారికీ 5% క్యాష్ బ్యాక్,  పేటిఎమ్ క్యాష్ బ్యాక్, జియో బెనిఫిట్స్, పేటిఎమ్ మరియు స్విగ్గి కూపన్లతో పాటుగా నో కాస్ట్ EMI ని కూడా అందిస్తుంది.                     

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo