హానర్ 8X ఈ రోజు ఉదయం 11:30 నిముషాలకు ఇండియాలో విదుదల కానుంది: లైవ్ స్ట్రీమ్ మరియు స్పెక్స్ వివరాలు

HIGHLIGHTS

హువావే యొక్క తాజా HiSillicon Kirin 710 SoC తో ఇండియాలో విడుదల కానున్న మొట్టమొదటి హానర్ డివైజ్ ఇదే అవుంతుంది.

హానర్ 8X ఈ రోజు ఉదయం 11:30 నిముషాలకు ఇండియాలో విదుదల కానుంది:  లైవ్ స్ట్రీమ్ మరియు స్పెక్స్ వివరాలు

 హువావే యొక్క ఉప బ్రాండ్ అయినటువంటి హానర్,  నేడు న్యూ ఢిల్లీలో ఈ హానర్ 8X విడుదల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సరికొత్త హానర్ స్మార్ట్ ఫోన్ మధ్య స్థాయి ఫోన్ ఉండనుంది. ఈ ఫోన్, హువావే యొక్క తాజా HiSillicon Kirin 710 SoC తో ఇండియాలో విడుదల కానున్న మొట్టమొదటి హానర్ డివైజ్  అవుంతుంది. ఇంకా దీనితో పాటుగా, GPU టర్బో మరియు 6GB వరకు ఎంపిక చేసుకోగల ర్యామ్ మరియు 128GB వరకు ఎంచుకోగల అంతర్గత స్టోరేజి వంటి ప్రత్యేకతలతో ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Honor 8X ప్రత్యేకతలు

ఈ హానర్ 8X ఒక ఆక్టా – కోర్ HiSilicon కిరిన్ 710 SoC చే శక్తినిస్తుంది. ఇది రెండు వైవిధ్యాలైన, 4GB RAM మరియు 64GB అంతర్గత నిల్వ మరియు 6GB RAM తో, 64GB లేదా 128GB గాని విస్తరించదగిన నిల్వ ఎంపికలతో వస్తుంది. ముందు చెప్పినట్లుగా, ఇది 6.5 అంగుళాల ఫుల్ – HD + TFT IPS డిస్ప్లే  1080 x 2340 రిజల్యూషన్తో మరియు 18.7: 9 కారక నిష్పత్తితో ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 8.1 ఓరెయో తో కూడిన EMUI 8.2.0 స్కిన్ పై నడుస్తుంది, ఈ మొత్తం ప్యాకేజీకి 3750mAh బ్యాటరీ శక్తినందిస్తుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ ఒక ద్వంద్వ కెమెరా సెటప్ను కలిగి ఉంటుంది. ఇక్కడ, ప్రాధమిక కెమెరాగా f / 1.8 ఎపర్చరుతో కూడిన 20MP సెన్సార్ ఉంది మరియు 2MP సెకండరీ సెన్సార్ ఉంది. ముందు భాగంలో, ఇది f / 2.0 ఎపర్చరుతో ఒక16MP లెన్స్తో వస్తుంది. ఇది 3.5mm హెడ్ఫోన్ జాక్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo