రియల్మీ నార్జో 30A: పెద్ద 6000mAh బ్యాటరీ G85 గేమింగ్ ప్రొసెసర్ తో లాంచ్

HIGHLIGHTS

రియల్మీ నార్జో 30A ఫోన్ బడ్జెట్ ధరలో విడుదల.

నార్జో 30A ను పెద్ద 6,000mAh బ్యాటరీ మరియు గేమింగ్ ప్రొసెసర్ తో తీసుకొచ్చింది.

రియల్మీ నార్జో 30A మొదటి సేల్ మార్చి 5 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి.

రియల్మీ నార్జో 30A: పెద్ద 6000mAh బ్యాటరీ G85 గేమింగ్ ప్రొసెసర్ తో లాంచ్

రియల్మీ నార్జో 30 ప్రో స్మార్ట్‌ఫోన్ తో పాటుగా ఈరోజు ఇండియాలో రియల్మీ నార్జో 30A బడ్జెట్ ఫోన్ ను కూడా విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం బడ్జెట్ ధరలో 18W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు పెద్ద 6,000mAh బ్యాటరీ మరియు గేమింగ్ ప్రొసెసర్ తో తీసుకొచ్చింది. ఈ రియల్మీ బడ్జెట్ ఫోన్ కేవలం రూ.8,999 ప్రారంభ ధరలో లాంచ్ అయ్యింది.                

Digit.in Survey
✅ Thank you for completing the survey!

రియల్మీ నార్జో 30A  : ధర

రియల్మీ నార్జో 30A 3GB + 32GB వేరియంట్ ధర :Rs. 8,999

రియల్మీ నార్జో 30A 4GB + 64GB వేరియంట్ ధర :Rs. 9,999  

రియల్మీ నార్జో 30A మొదటి సేల్ మార్చి 5 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి మొదలవుతుంది. 

రియల్మీ నార్జో 30A: స్పెషిఫికేషన్స్

రియల్మీ నార్జో 30A స్మార్ట్‌ఫోన్ 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ గల డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే మినీ డ్రాప్ నోచ్ డిజైన్ తో వుంటుంది. ఈ గరిష్టంగా 570 నిట్స్ బ్రైట్నెస్ అందిస్తుంది. నార్జో 30A మీడియా టెక్ హీలియో G85 చిప్సెట్ తో పనిచేస్తుంది. ఇది ఆక్టా కోర్ ప్రొసెసర్ మరియు మాలి -G52 GPU తో వుంటుంది. ఈ ప్రోసిజర్ కి జతగా 3GB/4GB ర్యామ్ మరియు 32GB/64GB స్టోరేజ్ మద్దతును కలిగి ఉంటుంది.

రియల్మీ నార్జో 30 A డ్యూయల్ కెమెరా సెటప్పును కలిగివుంది. ఇందులో, 13MP ప్రధాన కెమెరా బ్లాక్ & వైట్ సెన్సార్ లను కలిగివుంది. ముందుభాగంలో, సెల్ఫీల కోసం 8MP సెల్ఫీ కెమెరాని అందించారు. ఈ ఫోన్, అన్లాక్ ఫీచర్లుగా ఫేస్ అన్లాక్ మరియు బ్యాక్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కలివుంది. ఈ స్మార్ట్ ఫోన్ పవర్ ఫుల్ బ్యాటరీని కలిగి వుంది. ఈ రియల్మీ నార్జో 30A పెద్ద 6,000 mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో కలిగి వుంటుంది. ఈ ఫోన్, లేజర్ బ్లూ మరియు లేజర్ బ్లాక్ అనే రెండు రంగులలో లభిస్తుంది.   

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo