రియల్మీ 5 స్మార్ట్ ఫోన్ 4 కెమేరాలతో 10,000 ధరలో విడుదలకానుందా?
రియల్మీ 5 ప్రో యొక్క క్వాడ్ కెమెరా సెటప్‌లో 48 MP ప్రైమరీ సెన్సార్, అల్ట్రా వైడ్ సెన్సార్, సూపర్ మాక్రో సెన్సార్ మరియు డెప్త్ సెన్సార్ వంటివి ఉంటాయి.
రియల్మీ తన 5 సిరీస్ నుండి రియల్మీ 5 ప్రో మరియు రియల్మీ5 స్మార్ట్ ఫోన్లను భారతదేశంలో తీసుకురానుంది. ఈ ఫోన్‌లను, ఆగస్టు 20 న భారత మార్కెట్లో విడుదల చేయచేయనున్నట్లు, రియల్మీ ప్రకటించిన విషయం మనకు తెలుసు. ఈ స్మార్ట్‌ఫోన్‌ల గురించి ప్రచారం చేస్తున్న చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ రియల్మీ 5 సిరీస్‌లో క్వాడ్ కెమెరా సెటప్ అందిస్తోంది.
Surveyఅయితే, ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్ గురించి మరికొంత ముఖ్యమైన సమాచారం కూడా బయటపడింది. ఈ ఫోన్, ఒక క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 665 చిప్‌సెట్‌తో లాంచ్ చేయనున్నట్లు, ఇప్పుడు అర్ధమవుతోంది. ఇది కాకుండా దీన్ని రూ .10,000 లోపు తీసుకురావచ్చని కూడా అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఈ ఫోన్ యొక్క ప్రాసెసర్ సమాచారం గీక్బెంచ్ ద్వారా తెలియగా, ధరను గురించిన సమాచారం అధికారిక ట్వీట్ ద్వారా బయటకు వచ్చింది.
Some achievements on our technology journey
A. 1st to bring 48MP Quad camera smartphone in India
B. World’s 1st Quad camera smartphone under 10k 1st in India
C. Powerful Qualcomm chipset 1st time ever launching in India
All on 20th Aug #ProudIndian#HappyIndependenceDay pic.twitter.com/r9xDQt7PwM— Madhav '5'Quad (@MadhavSheth1) August 15, 2019
గీక్బెంచ్ జాబితా పరంగా చూస్తే, ఈ మొబైల్ ఫోన్‌లో, అంటే రియల్మీ 5 లో, ఒక స్నాప్‌డ్రాగన్ 665 చిప్‌సెట్ అందించనున్నట్లు తెలుస్తోంది, ఇది కాకుండా మీకు 4 జిబి ర్యామ్ మరియు ఆండ్రాయిడ్ 9 పై బేస్డ్ కలర్ OS 6 లేయర్ లభిస్తుంది.
ఈ రియల్మీ 5 ప్రో ఆగస్టు 20 న మధ్యాహ్నం 12:30 గంటలకు ఇండియాలో విడుదల కానుంది. అలాగే, ఇదే కార్యక్రమంలో కంపెనీ రియల్మీ 5 ను కూడా లాంచ్ చేయవచ్చు. లాంచ్ అయిన తర్వాత ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి వస్తుంది. రియల్మీ 5 ప్రో యొక్క క్వాడ్ కెమెరా సెటప్‌లో 48 MP ప్రైమరీ సెన్సార్, అల్ట్రా వైడ్ సెన్సార్, సూపర్ మాక్రో సెన్సార్ మరియు డెప్త్ సెన్సార్ వంటివి ఉంటాయి.
రియల్మీ 5 ప్రో యొక్క ఇండియా లాంచ్ గురించి, ఇది నాలుగు వెనుక కెమెరాలతో కూడిన స్మార్ట్ ఫోన్ గా ఉంటుందని, ఇందులో ఒక 48 MP ప్రధాన కేమెరా అమర్చబడిందని కంపెనీ ధృవీకరించింది. అలాగే, వెనుక వున్న కెమెరా సెటప్ నిలువుగా ఉంటుందని కూడా ప్రకటించింది. ఈ తాజా ట్విట్టర్ పోస్ట్ నుండి రియల్మి 5 ప్రో కెమెరా వివరాలు కూడా ఇవ్వబడ్డాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile