Paytm కొత్త అఫర్: LPG గ్యాస్ సిలిండర్ బుకింగ్ పైన రూ. 500 క్యాష్ బ్యాక్

HIGHLIGHTS

Paytm ద్వారా మీ గ్యాస్ బుకింగ్ పైన డబ్బు ఆదా

Paytm ద్వారా గ్యాస్ బుకింగ్ చేసుకునే వారికీ మాత్రమే ఈ అఫర్ వర్తిస్తుంది

LPG Gas బుకింగ్ పైన 500 రూపాయల క్యాష్ బ్యాక్

Paytm కొత్త అఫర్: LPG గ్యాస్ సిలిండర్ బుకింగ్ పైన రూ. 500 క్యాష్ బ్యాక్

నానాటికి గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగిపోతుంటే Paytm మాత్రం తన కొత్త అఫర్ తో తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్ ఇస్తానంటోంది. ఇప్పుడు  గ్యాస్ బుక్ చేయాలని చూస్తున్నా లేదా మీ గ్యాస్ బుకింగ్ పైన కొంత డబ్బును ఆదా చేయాలని చూస్తున్నా మీకు ఒక మంచి అవకాశాన్ని Paytm అందిస్తోంది. Paytm ద్వారా మీరు బుకింగ్ చేసుకొనే గ్యాస్ పైన 500 రూపాయల క్యాష్ బ్యాక్ మీకు లభిస్తుంది.           

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అయితే, ఆన్లైన్ చెల్లింపు సంస్థ అయిన Paytm ద్వారా గ్యాస్ బుకింగ్ చేసుకునే వారికీ మాత్రమే ఈ అఫర్ వర్తిస్తుంది.  అంతేకాదు,  Paytm ద్వారా గ్యాస్ బుకింగ్ చేసుకునే Indane Gas మరియు Bharat Gas వినియోగదారుల LPG Gas బుకింగ్ పైన మాత్రమే ఈ 500 రూపాయల క్యాష్ బ్యాక్ అఫర్ లభిస్తుంది. అయితే, ఈ క్యాష్ బ్యాక్ అఫర్ ను మీరు పొందాలంటే కొన్ని స్టెప్స్ అనుసరించాలి మరియు Paytm కొన్ని నిబంధనలను కూడా విధించింది. అవేమిటో పరిశీలిద్దాం…

  • Paytm యొక్క ఈ  LPG Gas బుకింగ్ క్యాష్ అఫర్ ను పొందాలంటే ముందుగా మీ వద్ద Paytm యాప్ ఉండాలి
  • మీ ఫోనులోని Paytm యాప్ లో రీఛార్జ్ & బిల్ పే అప్షన్ కు వెళ్ళాలి
  • ఇక్కడ మీరు LPG Cylinder Booking ఎంపికను చూడవచ్చు
  • ఇందులో మీరు LPG Gas Book పైన నొక్కిన వెంటనే మీకు కావాల్సిన గ్యాస్ కనెక్షన్ ఎంచుకోవాలి
  • ఇక్కడ  HP, Indane మరియు Bharat గ్యాస్ నుండి మీ అప్షన్ ఎంచుకోవచ్చు
  • మీ గ్యాస్ ప్రొవైడర్ ను ఎంచుకున్న తరువాత, మీ రిజిస్టర్ మొబైల్ లేదా LPG ID ని నమోదు చెయ్యాలి
  • ఇక్కడ మీ గ్యాస్ ఏజన్సీ, LPG కన్జ్యూమర్ నంబర్ మరియు మీ గ్యాస్ యొక్క ఇతర సమాచారాన్ని చూడవచు
  • చివరిగా, మీ గ్యాస్ బుకింగ్ కోసం యెంత డబ్బును చెల్లించాలో ఇక్కడ చూడవచ్చు

అయితే, ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ అఫర్ డిసెంబర్ 31 వరకూ మాత్రమే చెల్లుతుంది.

Paytm పైన LPG Gas బుకింగ్ పైన క్యాష్ బ్యాక్ అఫర్ పైన విధించిన షరతులను ఈ క్రింద చూడవచ్చు.

  • Paytm ద్వారా మొదటి సారి LPG Gas బుకింగ్ చేసుకునే LPG కస్టమర్లకు మాత్రమే ఈ అఫర్ వర్తిస్తుంది.
  • అఫర్ కోసం Promo Code విభాగంలో FIRST LPG కోడ్ ఎంటర్ చెయ్యాలి.
  • ఈ అఫర్ కేవలం Promo Code ఎంటర్ చేసిన వారికీ మాత్రమే ఇవ్వబడుతుంది
  • ఒకవేళ మీరు Promo Code ఎంటర్ చేయక పొతే మీకు అఫర్ వర్తించదు
  • ఈ అఫర్ కేవలం ఒక్కసారి వర్తిస్తుంది, మొదటిసారి బుకింగ్ పైన మాత్రమే.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo