OPPO A15: ఒప్పో ఎ 15 కేవలం రూ.10,990 ధరలో మంచి ఫీచర్లతో లాంచ్ అయ్యింది

HIGHLIGHTS

ఒప్పో ఎ 15 వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌తో లాంచ్ అయ్యింది

Oppo A15 బడ్జెట్ విభాగంలో గట్టి పోటీని ఇస్తుంది.

A15 వెనుకవైపు మూడు కెమెరాలతో డబ్బుకి తగిన విలువను అందిస్తుంది.

OPPO A15: ఒప్పో ఎ 15 కేవలం రూ.10,990 ధరలో మంచి ఫీచర్లతో లాంచ్ అయ్యింది

ఒప్పో ఎ 15 వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌తో భారతదేశంలో లాంచ్ అయ్యింది మరియు త్వరలో అమెజాన్ ఇండియా నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. రెడ్‌మి 9 సిరీస్ మరియు రియల్‌ మి 7 ఐ వంటి వాటికి వ్యతిరేకంగా A15 బడ్జెట్ విభాగంలో గట్టి పోటీని ఇస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఒప్పో A15 బడ్జెట్ విభాగంలో లంచ్ అవుతున్నందున, ఇది ఈ బ్లాక్‌లో సరికొత్త హార్డ్‌వేర్‌ను కలిగి ఉండదు, బదులుగా దాని వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ కటౌట్ మరియు వెనుకవైపు మూడు కెమెరాలతో డబ్బుకి తగిన విలువను అందిస్తుంది. భారతదేశంలో ఒప్పో A15 యొక్క ధర, స్పెషిఫికేషన్ మరియు ఫీచర్లను పరిశీలిద్దాం.

కేవలం 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ తో వచ్చిన ఈ ఒప్పో ఎ 15 ధర రూ .10,990 గా ప్రకటించింది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియాలో జాబితా చేయబడింది, అయితే అమ్మకం తేదీని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

oppo-a15-launch-inline.jpg

ఒప్పో A15 స్పెషిఫికేషన్లు

ఒప్పో A15 లో పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది, ఇది 7.9 మిల్లీమీటర్ల మందం మరియు 175 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. ఈ A15  ఫోన్ ఎంచుకోవడానికి డైనమిక్ బ్లాక్ మరియు మిస్టరీ బ్లూ అనే రెండు రంగులలో అందిస్తోంది.

A15 లో 6.52-అంగుళాల HD + (1600 x 720 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ప్లే ఉంది. ఇది పైన వాటర్‌డ్రాప్ నోచ్ కటౌట్ కలిగి ఉంది, ఇది 20: 9 యాస్పెక్ట్ రేషియోని  ఇస్తుంది, అయితే క్రింద అంచు మాత్రం చాలా వెడల్పుగా ఉంది.

ఇది మీడియా టెక్ హెలియో పి 35 ప్రాసెసర్ యొక్క ఆక్టా-కోర్ సిపియు మరియు Power-VR  గ్రాఫిక్స్ తో పనిచేస్తుంది. మైక్రో SD కార్డును ఉపయోగించి స్టోరేజ్ ను మరింత విస్తరించే ఎంపికతో ఇది 3GB RAM మరియు 32GB స్టోరేజ్ తో జత చేయబడింది. ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత కలర్‌OS 7.2 తో పనిచేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo