రెడ్మి K20 సిరీస్ స్మార్ట్ ఫోన్లు ఇక 24×7 సేల్ కి అందుబాటులో

రెడ్మి K20 సిరీస్ స్మార్ట్ ఫోన్లు ఇక 24×7 సేల్ కి అందుబాటులో

రెడ్మి K20 సిరీస్ స్మార్ట్ ఫోన్ల యొక్క ఫ్లాష్ సేల్ జరిగిన తదనంతరం, ఈ స్మార్ట్ ఫోన్లను ఓపెన్ సేల్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది.  ఒక 48MP ప్రధాన కెమేరాతో ట్రిపుల్ కెమేరా మరియు మంచి ప్రాసెసర్లతో వచ్చినటువంటి ఈ రెడ్మి K20 మరియు K20 ప్రో, ఇప్పటివరకూ ఫ్లాష్ సేల్ ద్వారా మాత్రమే  కొనసాగించగా, ఇప్పుడు 24×7 ఓపెన్ సేల్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ కొనడానికి  ఎదురు చూస్తున్నవారికి ఇది ఒక మంచి శుభవార్త.                                     

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Redmi K20  ధరలు

1.రెడ్మి K20  (6GB + 64GB) ధర – Rs.21,999

2.రెడ్మి K20  (6GB + 128GB) ధర – Rs.23,999       

Redmi K20 Pro ధరలు

1.రెడ్మి K20 ప్రో (6GB + 128GB) ధర – Rs.27,999

2.రెడ్మి K20 ప్రో (8GB + 256GB) ధర – Rs.30,999              

Redmi K20 Pro  :  ప్రత్యేకతలు

షావోమి ఈ రెడ్మి K20  ఫోనులో ఒక 7 వ జనరేషన్  ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానరును పరిచయం చేసింది. ఈ K20 స్మార్ట్ ఫోన్ ఒక 6.39 అంగుళాల FHD+  AMOLED డిస్ప్లేతో వస్తుంది. అయితే, ఇందులో ఎటువంటి నోచ్ లేకుండా పూర్తి డిస్ప్లేతో అందించింది. ఎందుకంటే, ముందు, సెల్ఫీల కోసం పాప్ అప్ సెల్ఫీ కెమేరాని ఇందులో అందించింది.  ఈ స్మార్ట్ఫోన్ 19.5: 9 ఆస్పెక్ట్ రేషియోతో మరియు 91.9 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో వస్తాయి. ఇది అత్యదికంగా 600 నిట్స్ బ్రైట్నెస్ అందిస్తుంది.  ఈ రెడ్మి K20 ప్రో యొక్క డిస్ప్లే యూట్యూబ్, Netflix మరియు PUBG వంటి వాటిలో HDR కంటెంటుకు మద్దతిస్తుందని కంపెనీ పేర్కొంది.  ఈ ఫోన్ యొక్క డిస్ప్లే ఒక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తక్షణతో అందించబడింది. అలాగే, వెనుక భాగంలో ఒక 3D కర్వ్డ్ గ్లాస్ డిజైన్ అందించింది.       

ఈ K20 వేరియంట్ AI సహాయంతో దాని బ్యాటరీ పనితీరును పెంచే స్మార్ట్ ఆప్టిమైజేషనుతో వస్తుంది. ఇక ఛార్జింగ్ మరియు బ్యాటరీ విషయాలకు వస్తే,  ఇందులో 27 W వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీతో 4000 mAh బ్యాటరీతో వస్తుంది. అయితే, బాక్స్ లో మాత్రం కేవలం 18వాట్స్ చార్జరును మాత్రమే అందించింది. అదనంగా, ఈ స్మార్ట్ ఫోన్స్  ఒక 3.5 mm జాక్ మరియు రెడ్మి K20 స్మార్ట్ఫోన్ ఒక స్నాప్డ్రాగెన్ 730 చిప్సెట్టుతో వస్తుంది. ఇది గరిష్టంగా, 2.2GHz వరకు క్లాక్ స్పీడును అందిస్తుంది. ఈ ఫోన్ AnTuTu పైన 2,18,625 స్కోరును సాధించినట్లు, షావోమి ప్రకటించింది.

ఈ  స్మార్ట్ ఫోను యొక్క వెనుక భాగంలో ఒక ట్రిపుల్ కెమేరా సెటప్పును  అందించింది. Sony IMX 586 సెన్సారుతో 48MP కెమేరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా ఇందులో వ్వబడింది. అలాగే, ఇది 8MP టెలిఫోటో లెన్స్ మరియు 13MP వైడ్ – యాంగిల్  లెన్స్ కలిగి ఉంది. ఈ కెమెరాలో అందించిన టెలిఫోటో కెమేరాతో 2X ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. ముందు కెమెరా విషయానికి వస్తే, 20 MP  సెల్ఫీ కెమేరా ఒక పాప్-అప్ మెకానిజంతో వస్తుంది. ఈ సెల్ఫీ కెమేరా ఒక కెమేరా ఎడ్జ్ లైటింగ్ సిస్టం తో వస్తుంది.  ఇది కార్బన్ బ్లాక్, ఫ్లేమ్ రెడ్ మరియు గ్లేసియర్ బ్లూ వంటి మూడు రంగుల ఎంపికలతో లభిస్తుంది.

Redmi K20 Pro  :  ప్రత్యేకతలు

షావోమి ఈ రెడ్మి K20 ప్రో ఫోనులో ఒక 7 వ జనరేషన్  ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానరును పరిచయం చేసింది. ఈ K20 ప్రో స్మార్ట్ ఫోన్ ఒక 6.39 అంగుళాల FHD+  AMOLED డిస్ప్లేతో వస్తుంది. అయితే, ఇందులో ఎటువంటి నోచ్ లేకుండా పూర్తి డిస్ప్లేతో అందించింది. ఎందుకంటే, ముందు, సెల్ఫీల కోసం పాప్ అప్ సెల్ఫీ కెమేరాని ఇందులో అందించింది.  ఈ స్మార్ట్ఫోన్ 19.5: 9 ఆస్పెక్ట్ రేషియోతో మరియు 91.9 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో వస్తాయి. ఇది అత్యదికంగా 600 నిట్స్ బ్రైట్నెస్ అందిస్తుంది.  ఈ రెడ్మి K20 ప్రో యొక్క డిస్ప్లే యూట్యూబ్, Netflix మరియు PUBG వంటి వాటిలో HDR కంటెంటుకు మద్దతిస్తుందని కంపెనీ పేర్కొంది.  ఈ ఫోన్ యొక్క డిస్ప్లే ఒక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తక్షణతో అందించబడింది. అలాగే, వెనుక భాగంలో ఒక 3D కర్వ్డ్ గ్లాస్ డిజైన్ అందించింది.       

ఈ ప్రో వేరియంట్ AI సహాయంతో దాని బ్యాటరీ పనితీరును పెంచే స్మార్ట్ ఆప్టిమైజేషనుతో వస్తుంది. ఇక ఛార్జింగ్ మరియు బ్యాటరీ విషయాలకు వస్తే,  ఇందులో 27 W వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీతో 4000 mAh బ్యాటరీతో వస్తుంది. అయితే, బాక్స్ లో మాత్రం కేవలం 18వాట్స్ చార్జరును మాత్రమే అందించింది.

అదనంగా, ఈ స్మార్ట్ ఫోన్స్  ఒక 3.5 mm జాక్ మరియు రెడ్మి K20 ప్రో స్మార్ట్ఫోన్ ఒక స్నాప్డ్రాగెన్ 855 చిప్సెట్టుతో వస్తుంది. ఇది గరిష్టంగా, 2.84GHz వరకు క్లాక్ స్పీడును అందిస్తుంది. ఈ ఫోన్ AnTuTu పైన 3,88,803 స్కోరును సాధించినట్లు, షావోమి ప్రకటించింది.

ఈ  స్మార్ట్ ఫోను యొక్క వెనుక భాగంలో ఒక ట్రిపుల్ కెమేరా సెటప్పును  అందించింది. Sony IMX 586 సెన్సారుతో 48MP కెమేరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా ఇందులో వ్వబడింది. అలాగే, ఇది 8MP టెలిఫోటో లెన్స్ మరియు 13MP వైడ్ – యాంగిల్  లెన్స్ కలిగి ఉంది. ఈ కెమెరాలో అందించిన టెలిఫోటో కెమేరాతో 2X ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. ముందు కెమెరా విషయానికి వస్తే, 20 MP  సెల్ఫీ కెమేరా ఒక పాప్-అప్ మెకానిజంతో వస్తుంది. ఈ సెల్ఫీ కెమేరా ఒక కెమేరా ఎడ్జ్ లైటింగ్ సిస్టం తో వస్తుంది. ఇది కార్బన్ బ్లాక్, ఫ్లేమ్ రెడ్ మరియు గ్లేసియర్ బ్లూ వంటి మూడు రంగుల ఎంపికలతో లభిస్తుంది.                        

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo