ఇక రియల్మీ 3 i ఓపెన్ సేల్ ద్వారా Flipkart మరియు Realme.com నుండి అమ్ముడవ్వనుంది

HIGHLIGHTS

అనేక బ్యాంక్ ఆఫర్లు మరియు ఎటువంటి వడ్డీ లేని No Cost EMI కూడా అందుబాటులో ఉంటుంది.

ఇక రియల్మీ 3 i ఓపెన్ సేల్ ద్వారా Flipkart మరియు Realme.com నుండి అమ్ముడవ్వనుంది

అతితక్కువ ధరలో 13MP+5MP మరియు 13MP సెల్ఫీ కెమేరా కలిగిన Realme 3i స్మార్ట్ ఫోన్ ఇప్పటి వరకూ ఫ్లాష్ సేల్ ద్వారా అమ్ముడవగా, ఇక నుండి ఓపెన్ సేల్ ద్వారా Flipkart మరియు Realme.com నుండి అమ్ముడవ్వనుంది.  ఈ ఫోన్, వెనుక డ్యూయల్ కెమేరా, గ్రేడియంట్ కలర్, డ్యూ డ్రాప్ నోచ్ మరియు మరిన్ని ప్రత్యేకతలు కలిగి కేవలం రూ.7,999 రూపాయల ప్రారంభదరతో వస్తుంది. అలాగే, అనేక బ్యాంక్ ఆఫర్లు మరియు ఎటువంటి వడ్డీ లేని No Cost EMI కూడా అందుబాటులో ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme 3i ధరలు

1. Realme 3i (3GB ర్యామ్ + 32 GB స్టోరేజి) ధర – Rs. 7,999

2. Realme 3i (4GB ర్యామ్ + 64 GB స్టోరేజి) ధర – Rs. 9,999

Realme 3i ప్రత్యేకతలు

ఈ రియల్మీ 3i వెనుక భాగంలో ఒక డ్యూయల్ రియర్ కెమేరాతో వస్తుంది. అలాగే, ఈ Realme 3i స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం ట్రెండీగా నడుస్తున్న, గ్రేడియంట్ కలర్ తో  కూడా కలిగి ఉంటుంది. ఈఫోన్ వెనుక 13MP+ 2MP సెన్సారులు కలిగిన డ్యూయల్ రియర్ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ ముందభాగంలో ఒక 13MP సెల్ఫీ కెమేరాతో వస్తుంది. ఇది డైమండ్ బ్లూ, డైమండ్ రెడ్ మరియు డైమండ్ బ్లాక్ వంటి మూడు కలర్ ఎంపికలతో వస్తుంది.

పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే, ఒక మీడియా టెక్ హీలియో P60 ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు జతగా 3GB /4GB శక్తితో వస్తుంది. అలాగే, ఇందులో అందించిన డిస్ప్లే ఒక 6.22 అంగుళాల పరిమాణం కలిగిన HD+ రిజల్యూషనుతో వస్తుంది. ఇది Color 6.0 OS తో ఆండ్రాయిడ్ 9 పై తో నడుస్తుంది.  ఇది ఒక పెద్ద 4,230 mAh బ్యాటరీతో ఉంటుంది. ఈ ఫోన్ను డైమండ్ కట్ డిజైనుతో మరియు తక్కువ బరువుతో తీసుకోచ్చింది.             

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo