యాక్షన్ కెమేరాతో విడుదలకానున్న Moto One Action స్మార్ట్ ఫోన్ : ఆగష్టు 23 న ఇండియాలోలాంచ్ కానుంది
ఈ ఫోనుతో తీసిన ఒక వీడియోను కూడా ఫ్లిప్కార్ట్ టీజర్లో అందించింది.
ముందుగా, బ్రెజిల్ మరియు మెక్సికోలలో ఒక యాక్షన్ కెమేరాతో, మోటరోలా తీసుకొచ్చిన స్మార్ట్‌ఫోన్ అయినటువంటి మోటోరోలా యాక్షన్ వన్ స్మార్ట్ ఫోన్ను ఇండియాలో విడుదల చేయడానికి సిద్ధం అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ను ఆగస్టు 23 వ తేదికి భారతదేశంలో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించనున్నట్లు కూడా తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ కోసం ఒక ప్రత్యేకమైన పేజీని కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ ఫోనుతో తీసిన ఒక వీడియోను కూడా ఫ్లిప్కార్ట్ టీజర్లో అందించింది. ఈ వీడియో చూస్తుంటే, నిజంగా యాక్షన్ కెమేరాతో తీసినట్లే అనిపిస్తుంది.
Surveyమోటరోలా వన్ యాక్షన్ ప్రత్యేకతలు ( బ్రెజిల్ )
మోటరోలా వన్ యాక్షన్ ఒక 6.3-అంగుళాల ఎల్‌సిడి డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది 1080 × 2520 పిక్సెళ్ళ FHD + డిస్ప్లే మరియు 21: 9 యాస్పెక్ట్ రేషియో మరియు 84 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తిని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 2.2 గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ ఎక్సినోస్ 9609 ప్రాసెసర్ ఉంది మరియు 4 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్‌తో వస్తుంది. ఒక డేడికేటెడ్ మైక్రో SD కార్డ్ ద్వారా ఈ ఫోను యొక్క స్టోరేజిని 512GB కి వరకూ పెంచవచ్చు. ఈ ఫోన్ వెనుక భాగంలో ఒక వేలిముద్ర సెన్సార్ అందించబడుతుంది.
ఇక కెమెరా గురించి మాట్లాడితే, ఈ స్మార్ట్ ఫోనులో వెనుక ఒక ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, దీనిలో ఒక 16 MP కెమెరా, మరొక 12 MP రెండవ కెమెరా మరియు 5MP మూడవ కెమెరాతో ఉంటుంది. ఇక సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం 12MP ముందు కెమెరా ఉంది.
మోటరోలా వన్ యాక్షన్ ఆండ్రాయిడ్ 9.0 పై పనిచేస్తుంది మరియు ఈ ఫోన్ ఆండ్రాయిడ్ వన్ ప్రోగ్రామ్‌లో భాగంగా రానుంది. ఈ ఫోన్ ఒక 3500 mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 10W ఛార్జింగుకు మద్దతు ఇస్తుంది. అలాగే, కనెక్టివిటీ ఎంపికల గురించి చూస్తే, ఈ పరికరం డ్యూయల్ 4G VoLTE , వైఫై 802.11 ఎసి (2.4 Ghz + 5 Ghz ), బ్లూటూత్ 5, జిపిఎస్ + గ్లోనాస్, NFC , USB టైప్-సి, 3.5 mm ఆడియో జాక్ మరియు ఎఫ్‌ఎం రేడియోతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 160.1 x 71.2 x 9.15mm మరియు 176 గ్రాముల బరువు కలిగి ఉంటుంది.
మోటరోలా వన్ యాక్షన్ ధరలు (బ్రెజిల్ )
మోటరోలా వన్ యాక్షన్ బ్రెజిల్ మరియు మెక్సికోలలో 6 286 (సుమారు రూ .20,500) కు లాంచ్ చేయబడింది మరియు ఈ పరికరాన్ని భారతదేశంలో అంతకంటే తక్కువ ధరకు విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ను రియల్మీ ఎక్స్, రెడ్మి కె 20, ఒప్పో కె 3 లకు పోటీగా, సుమారు రూ .20,000 ధరతో లాంచ్ చేయనున్నారు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile