రెడ్మి నోట్ 8 ఒక 64MP కెమేరాతో రావచ్చు :రిపోర్ట్

రెడ్మి నోట్ 8 ఒక 64MP కెమేరాతో రావచ్చు :రిపోర్ట్

భారతదేశంలో ఇటీవల విడుదలయ్యి చాలా గొప్ప అమ్మకాలను సాధించిన,  రెడ్మి నోట్ 7 కి తరువాతి తరంగా రెడ్మి నోట్ 8 సిరీస్ స్మార్ట్ ఫోన్లను తీసుకురావచ్చని  అనేక రూమర్లు మరియు వార్తలు ఇప్పుడు నెట్టింట్లో చాలానే చక్కర్లు కొడుతున్నాను . అంతేకాదు, రెడ్మి నోట్ 7 యొక్క అతిపెద్ద అప్గ్రేడ్ గా త్వరలోనే రెడ్మి నోట్ 8 లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇప్పుడు దీని గురించిన లేటెస్ట్ అప్డేట్ ను రెడ్మి యొక్క బ్రాండ్ జనరల్ మేనేజర్ అయిన లు వీబింగ్, రెడ్మి నోట్ 8 కి సంబంధించిన కొంత సమాచారాన్ని వీబోలో పంచుకున్నారు. అంతేకాదు,ఆయన ఇప్పటికే టెస్టింగ్ కోసం ఒక యూనిట్ కూడా కలిగి ఉన్నారు.

ఈ పోస్ట్‌లో, ఈ కొత్త ఫోన్ మెరుగైన చిత్రాలను తీయగలదని, మంచి బ్యాటరీ లైఫ్ మరియు హై-స్క్రీన్-టు-బాడీ రేషియోతో వస్తుందని ఆయన చెప్పారు.

వీబోలో పోస్ట్ చేయడానికి లు వీబింగ్ రెడ్మి నోట్ 8 ఫోన్ను ఉపయోగించినందున ఈ ఫోన్ కోసం సంస్థ పనిచేస్తుండడం నిజమే అని అర్ధమవుతుంది. వీబోలో కూడా ఇది ధృవీకరించబడింది.

అంతేకాదు, రెడ్మి నోట్ 7 ఒక 48MP ప్రధాన కెమేరాతో రాగా,  ఈ రెడ్మి నోట్ 8 64 MP కెమెరాతో వచ్చే స్మార్ట్‌ఫోన్ అవుతుందేమోనని అంచనావేస్తున్నారు. అయితే, అధికారికంగా ఎటువంటి స్పష్టత లేదు కాబట్టి ఇంకా ఈ విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు. కానీ, ఒక 64 MP  ఫోన్‌ను పెద్ద ఎత్తున తయారు చేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం అధికారికంగా తెలిపింది కాబట్టి, ఈ ఫోన్ అదే అయ్యివుండవచ్చని ఊహిస్తున్నారు. ఈ రెడ్‌మి నోట్ 8 అంచనాలను చూస్తే, రాబోయే ఈ ఫోన్ ఒక 64 MP కెమెరా లెన్స్‌తో వచ్చే అవకాశం మరింతగా పెరిగింది.

ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు రెడ్మి తన రెడ్మి 8 డివైస్‌ను కూడా విడుదల చేయనుంది మరియు ఈ ఫోన్‌ను M1908C3IC మోడల్ నంబర్‌తో టీనాలో గుర్తించారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఒక 6.2-అంగుళాల HD + డిస్ప్లే ను కలిగి ఉంది మరియు ఈ పరికరం 2.0GHz ఆక్టా-కోర్ ప్రాసెసర్, 4GB RAM మరియు 64GB స్టోరేజ్‌తో తీసుకురాబడుతుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ మరియు ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది మరియు ఇది ఒక పెద్ద 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.

వయా

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo