హానర్ దసరా సేల్ ప్రకటించింది : అక్టోబర్ 10 నుండి 15 వరకు

HIGHLIGHTS

హానర్ దసరా పండుగ కోసం ఈ సేల్, మంచి ఆఫర్లతో తీసుకువచ్చింది.

హానర్  దసరా సేల్ ప్రకటించింది : అక్టోబర్ 10 నుండి 15 వరకు

 హానర్, త్వరలో రానున్న పండుగ సీజన్ ని దృష్టిలో ఉంచుకుని తన అమ్మకాలను జోరుగా సాగించడానికి, మంచి ఆఫర్లతో ఈ దసరా సేల్ తీసుకొచ్చింది. ఈ సేల్ నుండి మీరు అనేక లాభాలు పొందవచ్చు. ఇందులో భాగంగా, 4000 రూపాయల డిస్కౌంట్, ఆశర్యకర బహుమతులు మరియు కొన్ని పరికరాలను కేవలం @ Rs1 చేల్లింపుతో కొనడం వాటి ఆఫర్లను కంపెనీ  ప్రకటించింది. ఈ Honor Dussehra Sale  తరువాత Honor Big Week మరియు Diwali Sale కూడా త్వరలో తేనున్నట్లు తన వెబ్ పేజీలో చూపిస్తుంది, హానర్.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

హానర్  దసరా సేల్లో, కంపెనీ వెబ్సైట్ నుండి ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి మీరు కొన్ని కూపన్లు ఆఫర్ చేస్తున్నారు. 20,000 రూపాయల కొనుగోలు చేస్తే, రూ. 1000 కూపన్, రూ. 10,000, కొనుగోలు చేస్తే రూ.500 కూపన్ మరియు రూ.5000 కి కొనుగోలు చేస్తే రూ. 300 కూపన్లను అందిస్తుంది. అదనంగా కొన్ని స్మార్ట్ఫోన్లు ఉత్తమ డిస్కౌంట్ తో అందిస్తుంది మరియు కొన్ని ఒప్పందాలు కూడా వస్తాయి. కొన్ని స్మార్ట్ ఫోన్ల మీద ఇచ్చిన డిస్కౌంట్లు ఈ క్రింద గమనించండి.

Honor 7S ప్రస్తుత ధర Rs. 8,999.  అయితే, ఈ ఫోన్ మీద ప్రకటించిన దసరా సేల్ డిస్కౌంట్ Rs. 2500, ఈ డిస్కౌంట్ తరువాత ఇది Rs .6,499 ధరతో కొనడానికి అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా, రూ .300 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.      

Honor 9N  ప్రస్తుత ధర Rs. 13,999 (3GB/32GB).  అయితే, ఈ ఫోన్ మీద ప్రకటించిన దసరా సేల్ డిస్కౌంట్ Rs. 4000, ఈ డిస్కౌంట్ తరువాత ఇది Rs .9,499 ధరతో కొనడానికి అందుబాటులో ఉంటుంది. అలాగే  4GB/64GB వేరియంట్ పైన కూడా 4000 రూపాయల డిస్కౌంట్ ఉంటుంది, ఈ డిస్కౌంట్ తరువాత దీని ధర Rs. 11,999 గా ఉంటుంది. ఇలాంటి డిస్కౌంట్ ఆఫర్లు మరికొన్ని ఫోన్ల మీద కూడా ప్రకటించింది. అంతేకాకుండా, రూ .300 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. హానర్ దసరా సేల్ ఇక్కడ నుండి చుడండి. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo