హానర్ 8X పైన Rs.7,000 రూపాయల డిస్కౌంట్
SBI క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్ కొనుగోలు చేసినట్లయితే, 10% తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.
ఆగష్టు 8 నుండి 10 వ తేదీ వరకు జరుగనున్న, అమేజాన్ ఫ్రీడమ్ సేల్ నుండి హానర్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ల పైన భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఇందులో భాగంగా, హానర్ 8X స్మార్ట్ ఫోన్ పైన ఏకంగా 7,000 రూపాయల డిస్కౌంట్ ని ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ మంచి డ్యూయల్ కెమేరా సెటప్పుతో పాటుగా పెద్ద స్క్రీన్ మరియు భారీ బ్యాటరీతో వస్తుంది.
Surveyఈ హానర్ 8X స్మార్ట్ ఫోన్ యొక్క 4GB మరియు 64GB వేరియంట్ ఈ సేల్ ద్వారా కేవలం రూ. 10,999 ధరతో మరియు 6GB మరియు 64GB వేరియంట్ కేవలం రూ. 12,999 ధరతో ఈ సేల్ ద్వారా అందిస్తోంది. అధనంగా, SBI క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్ కొనుగోలు చేసినట్లయితే, 10% తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ మొత్తాన్ని కూడా తగ్గిస్తే, 9,999 ధరకే ఈ ఫోన్ను మీ సొంతం చేసుకోవచ్చు.
Honor 8X ప్రత్యేకతలు
ఈ హానర్ 8X ఒక 6.5 అంగుళాల ఫుల్ – HD + TFT IPS డిస్ప్లే 1080×2340 రిజల్యూషనుతో మరియు 18.7: 9 ఆస్పెక్టు రేషియోతో ఉంటుంది. ఇది ఒక ఆక్టా – కోర్ HiSilicon కిరిన్ 710 SoC తో నడుస్తుంది. ఇది రెండు రకాలైన , 4GB RAM మరియు 64GB అంతర్గత స్టోరేజి మరియు 6GB RAM తో, 64GB లేదా 128GB వాటి స్టోరేజి ఎంపికలతో వస్తుంది. ఆండ్రాయిడ్ 8.1 ఓరెయో తో కూడిన EMUI 8.2.0 స్కిన్ పై నడుస్తుంది, ఈ మొత్తం ప్యాకేజీకి 3750mAh బ్యాటరీ శక్తినందిస్తుంది.
ఆప్టిక్స్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ ఒక ద్వంద్వ కెమెరా సెటప్ను కలిగి ఉంటుంది. ఇక్కడ, ప్రాధమిక కెమెరాకి f / 1.8 ఎపర్చరుతో కూడిన 20MP సెన్సార్ ఉంది మరియు 2MP సెకండరీ సెన్సార్ ఉంది. ముందు భాగంలో, ఇది f / 2.0 ఎపర్చరుతో ఒక16MP లెన్స్తో వస్తుంది. ఇది 3.5mm హెడ్ఫోన్ జాక్ కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile