మోటోరోలా వన్ విజన్ పైన భారీ డిస్కౌంట్ : 48MP+5MP మరియు పంచ్ హోల్ 25MP సెల్ఫీతో ఉంటుంది

HIGHLIGHTS

ICICI బ్యాంక్ వ్రేడిట్ మరియు డెబిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి 10% తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

మోటోరోలా వన్ విజన్ పైన భారీ డిస్కౌంట్ : 48MP+5MP మరియు పంచ్ హోల్ 25MP సెల్ఫీతో ఉంటుంది

ఇండియాలో ఒక పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా మరియు వెనుక ఒక 48MP+ 5MP డ్యూయల్ రియర్ కెమేరా వంటి  ప్రత్యేకలతో మోటోరోలా తీసుకొచ్చినటువంటి వన్ విజన్ స్మార్ట్ ఫోన్ రూ. 19,999 ధరతో ఇండియాలో విడుదయ్యింది.  ఇప్పటి వరకు ఈ స్మార్ట్ ఫోన్ ఇదే ధరతో అమ్ముడవుతుండగా, flipkart యొక్క నేషనల్ షాపింగ్ డేస్ సేల్ నుండి డిఇని పైన మొదటిసారిగా 2000 రూపాయల డిస్కౌంట్ లభించనుంది. ఈ సేల్ నుండి ఈ స్మార్ట్ ఫోన్నుకేవలం రూ. 17,999 ధరతో కొనుగోలు చేసే వీలు కల్పిస్తుంది. అధనంగా, ICICI బ్యాంక్ వ్రేడిట్ మరియు డెబిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి 10% తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.         

Digit.in Survey
✅ Thank you for completing the survey!

మోటో వన్ ప్రస్తుత ధర

మోటో వన్ విజన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజి ధర – Rs.19,999

Moto One Vision ప్రత్యేకతలు

 ఈ స్మార్ట్ ఫోన్ 6.3-అంగుళాల LCD ప్యానెల్ మరియు FHD + రిజల్యూషన్తో వస్తుంది.  ఒక  Exynos 9609 చిప్సెట్టుతో ఇది పనిచేస్తుంది. అయితే కేవలం 4GB RAM మరియు 128GB స్టోరేజి కలిగిన ఒకే ఒక్క వేరియంటుతో మాత్రమే  ఈ ఫోన్ను విడుదల చేసింది. అదనంగా, ఈ ఫోన్ మంచి  డైజైన్ తో ప్రవేశపెట్టబడింది. ఇందులో మీరు 21: 9 ఆస్పెక్ట్ రేషియోని పొందుతారు. అలాగే,  ఈ మోటో వన్ విజన్ యొక్క కెమెరా విభాగం గురించి మాట్లాడినట్లయితే, ఇందులో డ్యూయల్  కెమెరా సెటప్ ఇచ్చారు.

ఇందులో ఒక  48 మెగాపిక్సెల్ ప్రాధమిక కెమెరా సెన్సార్ ఉంది, ఇది f / 1.7 ఎపర్చరు కలిగిన ఒక 48MP కెమెరాతో వస్తుంది. మోటోరోలా నుండి ఒక 48MP కెమేరాతో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్ ఫోనుగా ఇది నిలుస్తుంది. అయితే, ఇందులో smasung GM1 సెన్సార్ తో అందించింది. ఈ ప్రధాన కెమేరాకి జతగా,  ఒక 5 MP సెకండ్ కెమేరాని డెప్త్ సెన్సింగ్ కోసం అందించారు. ఇది OIS కు మద్దతు ఇస్తుంది మరియు ఇందులో నైట్ టైం లో మంచి ఫోటోలను తీసుకునేలా,  నైట్ వ్యూ మోడ్నికూడా  అందుకుంటారు. ఈ స్మార్ట్ ఫోనులో, సెల్ఫీల కోసం 25-మెగాపిక్సెల్ కెమెరా ఇవ్వబడింది. ఈ స్మార్ట్ ఫోన్  ఆండ్రాయిడ్ 9 పై OS, స్టాక్ ఎక్స్పీరియన్సుతో వస్తుంది. ఇది బాక్సునుండి 15W టర్బోపవర్ ఛార్జింగ్ మద్దత్తు కలిగిన 3,500mAh బ్యాటరీతో వస్తుంది.  

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo