ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ భారీ ఆఫర్‌లతో తిరిగి వచ్చింది

HIGHLIGHTS

Flipkart బిగ్ దివాళీ సేల్ మళ్ళీ వచ్చేసింది

కోసం Flipkart నిర్వహించిన Flipkart Big Diwali సేల్ ను మరొకసారి ప్రకటించింది.

ఈసారి ఇంకా మంచి ఆఫర్లను ప్రకటించింది

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ భారీ ఆఫర్‌లతో తిరిగి వచ్చింది

Flipkart బిగ్ దివాళీ సేల్ మళ్ళీ వచ్చేసింది. దీపావళి పండుగ కోసం Flipkart ఇటీవల నిర్వహించిన ఈ Flipkart Big Diwali సేల్ ను మరొకసారి ప్రకటించింది. అంతేకాదు, ఈసారి ఇంకా మంచి ఆఫర్లను ప్రకటించింది.ఈ సేల్ నవంబర్ 8 న మొదలవుతుంది మరియు నవంబర్ 13 వరకూ కొనసాగుతుంది. ముఖ్యంగా, ఈ సేల్ నుండి ఎలక్ట్రానిక్ మరియు యాక్సెసరిస్ పైన గరిష్టంగా 80% వరకూ భారీ డిస్కౌంట్ అఫర్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ Flipkart బిగ్ దివాళీ సేల్ గురించిన మరిన్ని వివరాలను ఈ క్రింద చూడవచ్చు.          

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ముందుగా ప్రకటించిన రెండు సేల్స్ నుండి  మంచి డిస్కౌంట్స్, బ్యాంక్ ఆఫర్స్ మరియు మరిన్ని లాభాలను వినియోగదారుల కోసం అందించింది. ఆయితే, ఈసారి మరిన్ని ఆఫర్లను తీసుకొస్తోంది. అంతేకాదు, ఈ సేల్ ద్వారా ఇవ్వనున్న ఆఫర్లు, డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో పాటుగా మరిన్ని వివరాలను కూడా చూపిస్తోంది.

ఇక ఈ సేల్ ద్వారా ఇవ్వనున్న ఆఫర్ల విషయానికి వస్తే, Flipakrt ప్రస్తుతం చేస్తున్న టీజింగ్ పరిశీలిస్తే, TV లు మరియు గృహోపకరణాల (హోమ్ అప్లయన్సెస్) పైన గరిష్టంగా 80% వరకు డిస్కౌంట్ అందించే అవకాశం వుంది. ఇక మొబైల్ ఫోన్ల విషయంలో కూడా మంచి ఆఫర్లను ప్రకటించవచ్చు. ఎందుకంటే, మొబైల్ ఫోన్ల పైన అన్ని ప్రధాన బ్యాంక్స్ నుండి No cost EMI,  మొబైల్ ప్రొటక్షన్ మరియు బెస్ట్ Exchange వంటి ఆఫర్లను ఇప్పటికే ప్రకటించింది.

అలాగే, ఎప్పటిలాగానే మహా ప్రైస్ డ్రాప్, క్రేజీ డీల్స్ మరియు రష్ అవర్ వంటి స్పెషల్ ఆఫర్లు కూడా ఉంటాయి. ఈ సేల్ ని ఈసారి Axis, Citi , ICICI మరియు Kotak  బ్యాంక్ యొక్క భాగస్వామ్యంతో తీసుకొస్తోంది కాబట్టి, ఈ నాలుగు బ్యాంకుల క్రెడిట్, డెబిట్ మరియు EMI ద్వారా వస్తువులను కొనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ అందుకోవచ్చు. ఇంకా మరిన్ని ఆఫర్లు మరియు  డీల్స్ తో పాటుగా కొత్త లాంచ్ ఆఫర్లను కూడా వెల్లడించవచ్చు.                               

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo