Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ : Oppo A71 (3GB) మరియు Lenovo K8 Plus స్మార్ట్ ఫోన్లు Rs. 6,990 ధరకే
క్రేజీ డీల్స్ యొక్క ధరలు ఆవిష్కరించిన ఫ్లిప్ కార్ట్, ఈ ఆఫర్లో Oppo A71 (3GB) మరియు Lenovo K8 Plus స్మార్ట్ ఫోన్లు Rs. 6,990 ధరతో దర్శనమిచ్చాయి. అయితే, ప్రస్తుత వీటి MRP 10999.
అక్టోబర్ 10 నుండి 14 వరకు జరగనున్న ఫ్లిప్ కార్ట్ యొక్కబిగ్ బిలియన్ డేస్ సేల్, మంచి డీల్స్ తీసుకువచ్చే అవకాశమునట్లు అనిపిస్తుంది. ఎందుకంటే, ప్రస్తుతం ఆవిష్కరించిన కొన్ని స్మార్ట్ ఫోన్ల ధరలు ఈ మాటలని నిజం చేసేలా ఉన్నాయి. మంచి ప్రత్యేకతలు మరియు లక్షణాలని కలిగిన Oppo A71 (3GB) మరియు Lenovo K8 Plus స్మార్ట్ ఫోన్లు ప్రస్తుతం Rs. 10,999 ధరతో ఉండగా ఈ సేల్ యొక్క జాబితాలో వీటి ధర Rs. 6,990 గా ప్రకటించేంచడం జరిగింది. అంటే, ఈ స్మార్ట్ ఫోన్ల మీద మనకు నేరుగా 4000 డిస్కౌంట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అలాగే, ఇంకా మరెన్నో మొబైల్స్ మీద చాల ఆఫర్లు ఆవిష్కరించింది Flipkart.
Survey
Oppo A71 (3GB) ప్రత్యేకతలు
ఈ ఫోన్ ఒక 5.2 -అంగుళాల HD డిస్ప్లే కలిగివుంటుంది. ఇది స్నాప్ డ్రాగన్ 450 ఆక్టా కోర్ చేత శక్తిపొందినది. ఇది 3GB RAM మరియు 16GB అంతర్గత నిల్వని కలిగి ఉంటుంది మరియు మెమొరీ కార్డుతో దీని స్టోరేజి 256GB వరకు విస్తరించవచ్చు. కెమెరా గురించి చుస్తే, వెనుక 13MP ప్రధాన కెమెరా సెటప్ మరియు 5MP సెన్సర్ని ముందు కలిగి ఉంటుంది. ఇది ఒక 3000mAh బ్యాటరీతో వస్తుంది, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ నౌగాట్ 7.1 OS తో నడుస్తుంది.
Lenovo K8 Plus ప్రత్యేకతలు
ఈ ఫోన్ ఒక 5-అంగుళాల ఫుల్ హెచ్ డి + డిస్ప్లే తో మరియు మీడియా టెక్ MTK హీలియో P25 ఆక్టా కోర్ చేత శక్తిపొందినది. ఇది 3GB RAM మరియు 32GB అంతర్గత నిల్వని కలిగి ఉంటుంది. కెమెరా గురించి చుస్తే, వెనుక 13MP + 5MP డ్యూయల్ కెమెరా సెటప్ మరియు 8MP సెన్సర్ని ముందు కలిగి ఉంటుంది. ఇది ఒక పేద్ద 4000mAh బ్యాటరీతో వస్తుంది, ఇంకా స్టాక్ ఆండ్రాయిడ్ వెర్షన్ తో కూడిన ఆండ్రాయిడ్ నౌగాట్ 7.1.1 OS తో నడుస్తుంది. వీటితో పాటుగా మరెన్నో ఆఫర్లని అందించనుంది ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్.
గమనిక :పైన తెలిపిన ధరల వివరాలు ఫ్లిప్ కార్ట్ నుండి తీసుకోబడినవి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile