కేవలం రూ.699 ధరలో బెస్ట్ ఫీచర్లతో కొత్త ఫీచర్ ఫోన్ వచ్చింది

HIGHLIGHTS

Detel కేవలం రూ .699 కు డి 1 గురు యొక్క కొత్త వెర్షన్ను ప్రవేశపెట్టింది.

Detel D1 Guru ఫోన్లో ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ జెడ్-టాక్ను అందించడం గోప్ప విషయం

ఇంతతక్కువ ధరలో ఈ ఫీచర్ అందించిన మొట్టమొదటి సంస్థ డీటెల్

కేవలం రూ.699 ధరలో బెస్ట్ ఫీచర్లతో కొత్త ఫీచర్ ఫోన్ వచ్చింది

విశ్వసనీయమైన మరియు వినియోగదారులను అర్థం చేసుకునే, కస్టమర్ వాల్యూ కంపెనీ అయిన Detel ఈ రోజు ఇండియన్ ఫీచర్ ఫోన్ విభాగంలో కేవలం రూ .699 కు డి 1 గురు యొక్క కొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. నేవీ బ్లూ మరియు బ్లాక్ వంటి రెండు కొత్త కలర్ వేరియంట్లను కంపెనీ ప్రవేశపెట్టింది. 16 జిబి ఎక్స్‌పాండబుల్ మెమరీ, బిటి డయలర్, జిపిఆర్‌ఎస్ వంటి మరికొన్ని స్మార్ట్ ఫీచర్లను కూడా కంపెనీ జోడించింది. క్రొత్త వెర్షన్ తో సరికొత్త డి 1 గురు www.detel-india.com వెబ్సైట్ లో వినియోగదారులకు అందుబాటులో ఉండగా, పెద్దమొత్తంలో కొనుగోలుదారులు దీన్ని https://www.b2badda.com లో ఆర్డర్ చేయవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇంత తక్కువ ఖర్చుతో కూడిన ఫోన్‌లో ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ జెడ్-టాక్‌ను అందించడం గోప్ప విషయం మరియు ఇంతతక్కువ ధరలో ఈ ఫీచర్ అందించిన  మొట్టమొదటి సంస్థ డీటెల్. దీని సహాయంతో మీరు ఏ స్మార్ట్‌ఫోన్‌కు అయినా మెసేజ్ మరియు ఇమేజ్ పంపవచ్చు. డి 1 గురు 1.8 '' ఎల్‌సిడి డిస్‌ప్లే, డ్యూయల్ ఫ్లాష్‌లైట్, ఆడియో అండ్ వీడియో ప్లేయర్, డిజిటల్ కెమెరా, వైర్‌లెస్ ఎఫ్ఎమ్, పవర్ సేవింగ్ మోడ్, ఎస్‌ఓఎస్ మరియు 1000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం వంటి ఫీచర్లను కలిగి ఉంది.

డీటెల్ వ్యవస్థాపకుడు యోగేష్ భాటియా, ఈ ఫోను మాట్లాడుతూ, "డీటల్ ఫీచర్ ఫోన్ల  పట్ల అటాచ్మెంట్ మరియు ట్రస్ట్ స్థాయి పరంగా భారతదేశంలో అగ్రస్థానానికి చేరుకుంది. చిన్న మరియు మధ్య తరహా నగరాల్లో మా ఉనికిని బలోపేతం చేయడానికి, తక్కువ ఖర్చుతో ప్రత్యేక సాంకేతికత వంటి లక్షణాలను కలిగిన కస్టమర్ల కోసం ఈ డి 1 గురును పరిచయం చేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. దీని ద్వారా, స్మార్ట్ ‌ఫోన్ ‌లను కొనుగోలు చేసే స్థితి లేని విఐయోగదారులను చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాము, అని పేర్కొన్నారు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo