రేపటి నుండి ఫ్లిప్ కార్ట్ యొక్క దీపావళి సేల్ మొదలుకానుంది : ఫ్లిప్ కార్ట్ ప్లస్ సభ్యులకి ఈ రోజు 9PM నుండే ఎంట్రీ
దీపావళి పండుగ కోసం బంపర్ ఆఫర్లను తీసుకొస్తున్నట్లు, చెబుతున్న ఈ సేల్ రేపటినుండి మొదలవుతుంది
ఫ్లిప్ కార్ట్ దీపావళి పండుగ సేల్ రేపటి నుండి మొదలుకానుంది, నవంబర్ 1 నుండి నవంబర్ 5 వరకు జరగనున్న ఈ సేల్ SBI క్రెడిట్ కార్డు భాగస్వామ్యంతో ప్రత్యేకంగా రానుంది. ముందుగా వచ్చిన ఫెస్టివ్ సేల్ నుండి షాపింగ్ చేయలేనివారు, ఇప్పుడు వస్తున్న ఈ దీపావళి సేల్ నుండి ఉత్తమప్రయోజనాలను పొందడానికి మంచి అవకాశం. ఇప్పటికే, హోమ్ పేజీ లో ఫర్నిచర్ ఫియస్టా పేరిట ఫర్నిచర్ పైన 70% డిస్కౌంట్ ని అందినచనున్నట్లు తెలుస్తోంది.
Surveyఅలాగే, లెనోవో పైన బెస్ట్ డీల్స్ ఇవ్వనున్నట్లు చూపిస్తోంది, ఇందులో భాగంగా లెనోవో A5 2GB/16GB వేరియంట్ Rs. 5,999, లెనోవో A5 3GB/32GB వేరియంట్ Rs. 6,999 మరియు లెనోవో K9 3GB/32GB వేరియంట్ Rs. 8,999 ధరతో హోమ్ పేజీ 'Big Diwali Sale' బ్యానర్లో చూపిస్తోంది. అంతేకాకుండా, 'Subh Bhi Labh Bhi' అనే పేరుతొ మొబైల్ మరియు టాబ్లెట్ల పైన గొప్ప డిస్కౌంట్లను ఇవ్వనున్నట్లు చూపిస్తోంది.
ఈ దీపావళి సేల్లో, తాజా మొబైల్స్ పైన కూడా ఆఫర్లను అందించనున్నట్లు కూడా బ్యానర్లో తెలుపుతోంది. ఇంద్భులో భాగంగా, Redmi 6 (64GB) వేరియంట్ Rs. 9,499 ధరతో కొనుగోలు చేయవచ్చని చెబుతోంది. అలాగే, Rs. 20,999జాబితా గల Moto X4 పైన 10,000 డిస్కౌంట్ అందిస్తోంది, ఈ సేల్ నుండి ఈ ఫోన్ Rs.10,999 కొనుగోలు చేయవచ్చు. ఇలాంటి మారెన్నో, చాల గొప్ప డీల్స్ ఈ సేల్ తో తీసుకురానున్నట్లు ఫ్లిప్ కార్ట్ హోమ్ పీజీ బ్యానర్లో చూపిస్తోంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile