మీ ఫోన్ లో ఈ గుర్తులు కనిపిస్తున్నాయా..అయితే, హ్యాక్ అయినట్లే.!

మీ ఫోన్ లో ఈ గుర్తులు కనిపిస్తున్నాయా..అయితే, హ్యాక్ అయినట్లే.!
HIGHLIGHTS

మీ ఫోన్ లో ఈ లక్షణాలు ఉంటే చూడండి

ఆన్లైన్లో తో సౌలభ్యంతో పాటు సమస్యలు కూడా వస్తున్నాయి

ఈ గుర్తులు మీకు కనిపిస్తే మీ ఫోన్ హ్యాక్ అయినట్లుగా మీరు గుర్తించవచ్చు

టెక్నాలజీ పెరిగిన తరువాత ప్రతి విషయం చాలా సులభంగా మారాయి. ప్రజలు చాలా సులభంగా వారి పనులను వారి మొబైల్ ఫోన్ ద్వారా ఆన్లైన్లో నిర్వహించడానికి అలవాటు పడిపోయారు. సరిగా ఇదే విషయాన్ని టార్గెట్ చేస్తున్న కొందరు హ్యాకర్లు, మొబైల్ ఫోన్లను హ్యాక్ చేసే యాడ్స్ ను అడ్వార్టైజ్ చేయడం లేదా పర్సనల్ డేటాను చేజిక్కించు కోవడం వంటి అనైతిక పనులను చేస్తున్నారు. మీ ఫోన్ లో అటువంటి సమస్య వుందా? అని మీకు డౌట్ రావచ్చు. అందుకే, మీ ఫోన్ లో ఈ ఎటువంటి గుర్తులు కనిపిస్తే మీ ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఉందో ఈరోజు వివరంగా చూద్దాం.                    

మీ ఫోన్ లో సాధారంగా కాకుండా ఇక్కడ సూచించిన లక్షణాలను కలిగి ఉన్నట్లయితే, మీరు మీ ఫోన్ గురించి అనుమానం వ్యక్తం చేయవచ్చు. మరి ఆ లక్షణాలు ఏమిటో చూద్దామా.

ముందుగా, మీ హ్యాక్ అయినట్లయితే మీ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ అసాధారణంగా ఉంటుంది. అంటే, చాలా త్వరగా మీ ఫోన్ బ్యాటరీ అయిపోతుంది. అలాగే, మీరు వాడకుండానే మీ డేటా అయిపోతుంది లేదా మీరు ఉపయోగించే డేటా కంటే అధికంగా డేటా ఖర్చు అవుతుంది. ముఖ్యంగా, బాగా వేగంగా పనిచేసే మీ ఫోన్ స్పీడ్ సడన్ గా పడిపోతుంది. అంటే, మీ ఫోన్ బాగా స్లో అయిపోతుంది. మీ ఫోన్ లో రన్నింగ్ లో ఉన్న యాప్స్ క్లోజ్ అవ్వడం, ఫోన్ దానంతట అదే Restart అవ్వడం వంటి లక్షణాలు లేదా గుర్తులు మీకు కనిపిస్తే, మీ ఫోన్ హ్యాక్ అయినట్లుగా మీరు గుర్తించవచ్చు.

అయితే, ఈ లక్షణాలను చాలా కాలంగా ఉపయోగిస్తున్న పాత మొబైల్ లలో చూసే సాధారణ సమస్యగా మీరు గుర్తించవచ్చు. అయితే, కొత్తగా తీసుకున్న లేటెస్ట్ ఫోన్లలో మీరు సమస్యలను గుర్తించినట్లయితే, మీ ఫోన్ హ్యాక్ అయినట్లుగా ఫ్రీగాణలోకి తీసుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo